రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారి ముజ్మిల్ షరీఫ్ అరెస్టు

సంచలనం సృష్టించిన బెంగుళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఉన్న నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది

  • Publish Date - March 28, 2024 / 02:54 PM IST

  • పరారిలో ప్రధాన నిందితులు
  • సోదాల్లో లభ్యమైన పేలుడు పరికరాలు

విధాత : సంచలనం సృష్టించిన బెంగుళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఉన్న నిందితుడిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిందితుడు ముజ్మిల్ షరీఫ్‌ను అరెస్టు చేసినట్లుగా ఎన్‌ఐ తెలిపింది. 18ప్రాంతాల్లో కీలక సోదాలు నిర్వహించి నిందితుడుని పట్టుకున్నట్లుగా తెలిపింది. ఇప్పటికే రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసులో శివమొగ్గకు చెందిన ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్‌ను గుర్తించింది. షాజిబ్ సహచరుల్లో ఒకరైన అబ్దుల్ మతీన్ తాహాని కూడా యాంటీ టెర్రర్ ఏజెన్సీ గుర్తించింది. తాహా కూడా తీర్థహళ్లికి చెందిన వాడిగా గుర్తించారు. తమిళనాడు పోలీస్ ఇన్ స్పెక్టర్ కె విల్సన్ హత్య కేసులో తాహాకు సంబంధం ఉందన్నారు అధికారులు.

షాజిబ్ తో పాటు తాహా చెన్నైలో ఉన్నట్లు తెలిపారు. వారిద్దరకి ఐసిస్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పేలుడుకు ప్రధాన సూత్రధారి ముజ్మిల్ షరీఫ్‌ను అరెస్టు చేయడం ద్వారా దర్యాప్తు సంస్థలు కీలక పురోగతి సాధించాయి. నిందితులు ముగ్గురి ఇండ్లలో సోదాలు నిర్వహించగా ఎలక్ట్రానిక్ పరికరాలు, డీవైస్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. పేలుడు వెనుక భారీ కుట్ర ఉందని, ప్రధాన నిందితులకు పేలుడు పదార్ధాలను, సాంకేతిక పరికరాలను ముజ్మీల్ సరఫరా చేశారని ఎన్‌ఐఏ ప్రకటించింది. ప్రధాని నిందితులు ముస్సావిర్ హుస్సెన్ షాజిబ్‌, అబ్ధుల్ మతీన్ తాహాలు పరారిలో ఉన్నట్లుగా పేర్కోంది.

Latest News