ఎయిర్ ఫోర్స్ అధికారిణిపై అత్యాచారం

విధాత‌: కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్‌ వాయుసేన శిక్షణ కళాశాలలో అధికారిణిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణపై మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన అధికారిణి(28) ఇక్కడి కళాశాలలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 10న క్రీడా శిక్షణలో ఆమె గాయపడి, చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటుండ‌గా.. అదే కళాశాలలో శిక్షణ పొందుతున్న అమితేష్‌ ఆమె గదిలోకి దూరి అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో స‌ద‌రు అధికారిణి కోయంబత్తూరు పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. […]

  • Publish Date - September 27, 2021 / 09:52 AM IST

విధాత‌: కోయంబత్తూరు రెడ్‌ఫీల్డ్‌ వాయుసేన శిక్షణ కళాశాలలో అధికారిణిపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణపై మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీకి చెందిన అధికారిణి(28) ఇక్కడి కళాశాలలో కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 10న క్రీడా శిక్షణలో ఆమె గాయపడి, చికిత్స పొంది, తన గదిలో విశ్రాంతి తీసుకుంటుండ‌గా.. అదే కళాశాలలో శిక్షణ పొందుతున్న అమితేష్‌ ఆమె గదిలోకి దూరి అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో స‌ద‌రు అధికారిణి కోయంబత్తూరు పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి అమితేష్ ను అరెస్టు చేసి మేజిస్ట్రేట్‌ నివాసగృహం వద్ద హాజరుపరిచారు.