ఔటర్‌పై రోడ్డు ప్రమాదం..భారీగా నిలిచిపోయిన వాహనాలు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వచ్చేదారిలో అప్పా జంక్షన్‌ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నది

  • Publish Date - December 8, 2023 / 01:56 PM IST

విధాత: ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వచ్చేదారిలో అప్పా జంక్షన్‌ రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మూడు వాహనాలు ఒకదాని తర్వాత ఒకటిగా ఢీకొన్నాయని సమాచారం. దీంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దడంతో వాహనాలు కదిలాయి.