పొట్టలో బంగారం.. తనిఖీల్లో పట్టివేత

విదేశాల విమానాల్లో బంగారం స్మగ్లింగ్‌ చేసేవారు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తుంటారు. అలాంటిదే ఒక రకం మోసాన్ని బుధవారం శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు రట్టు చేశారు

విధాత: విదేశాల విమానాల్లో బంగారం స్మగ్లింగ్‌ చేసేవారు రకరకాల పద్ధతులు ఉపయోగిస్తుంటారు. అలాంటిదే ఒక రకం మోసాన్ని బుధవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం అధికారులు రట్టు చేశారు. మస్కట్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్‌ అధికారులు వారికి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి పొట్ట నిండా బంగారం పేస్ట్‌ క్యాప్స్యూల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. బహ్రెయిన్‌ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు బంగారాన్ని లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే ప్రయత్నం చేయగా అతన్ని కూడా పట్టుకున్నారు. అలా ఇద్దరి వద్ద నుంచి 65లక్షల విలువజేసే 1100 గ్రాముల బంగారాన్నిస్వాధీనం చేసుకొన్నారు.