విధాత:బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిరీష (19) అనే యువతి హత్య కేసులో ప్రధాన ముద్దాయి బాలరాజు చరణ్ (22) తో పాటు అతనికి సహకరించిన గొడుగునూరు నాయబ్ రసూల్(20), పేరుసోమల నరసింహ(20) అరెస్టు..తల్లిదండ్రులతో కలిసి పొలంలో వ్యవసాయ పనుల్లో ఉన్న సమయంలో తనను ప్రేమించాలని,పెళ్లి చేసుకోవాలని వేధించిన ప్రధాన ముద్దాయి బాలరాజు చరణ్.. తల్లిదండ్రులను వ్యతిరేకించి తాను ప్రేమించలేనని చరణ్ కు తెలిపిన శిరీష..
శిరీషపై కోపంతో సమీపంలోని కొడవలితో శిరీషను నరికిన చరణ్..గ్రామస్థులు వెంటనే నిందితున్ని పోలీసులకు అప్పగించడం జరిగింది..పోలీసుల విచారణలో ప్రధాన ముద్దాయికి ఘటనలో మరో ఇద్దరు సహకరించినట్లు వెల్లడయిందన్న జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్.ముగ్గురిని అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి రిమాండ్ చేస్తున్నాం..
జిల్లాలో ఎవరైనా, ఎక్కడైనా మానసిక, శారీరక హింస కు గురైతే, లేదా వేధింపులకు గురైతే డయల్ 100 కు లేదా జిల్లా ఎస్.పి ఫోన్ నెంబర్ 9440796900 కు ఫిర్యాదు చేస్తే వారి సమస్యను పరిష్కరిస్తామని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం..బాధితులకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని జిల్లా ఎస్.పి భరోసా..ఇచ్చారు.
ఇటీవల కడప నగరంలో ఓ యువతిని వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే తక్షణం ‘దిశ’ డి.ఎస్.పి గారికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని, నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిందని ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ వివరించారు.
ReadMore:యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది