సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడవలు బోల్తా
గాలింపు చర్యలు ముమ్మరం లభ్యమైన పసిబిడ్డ మృతదేహం
విధాత,విశాఖపట్నం : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్‌లో రెండు నాటు పడ బోల్తా పడ్డాయి. ఈ ఘటన సీలేరుగుంట వాడ దగ్గర జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతు కాగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. గల్లంతు అయిన మరో ముగ్గురి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కొందుగూడ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు.
మొత్తం ఐదు పడవల్లో ప్రయాణిస్తుండగా రెండు పడవలు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగనట్లు తెలుస్తోంది. రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. గాలింపు చర్యల్లో ఏడాది పసిబిడ్డ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఆరా తీశారు. సీలేరు జెన్‌కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు.