Warangal : అధిక లాభం ఆశ చూపి కోట్లల్లో దోచేస్తున్న ముఠా అరెస్ట్

పెట్టుబడి పేరుతో కోట్ల మోసం చేసిన ముఠా అరెస్ట్, బంగారం-నగదు స్వాధీనం, వరంగల్ టాస్క్ ఫోర్స్ సీజ్.

warangal-task-force-busts-hephzibah-chit-fraud-gang-4-arrested-crores-cheated

విధాత, వరంగల్ ప్రతినిధి: పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో లాభం ఆశ చూపిస్తూ ప్రజల నుండి కోట్ల రూపాయలను దోచేసిన నలుగురు సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్, పాలకుర్తి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుండి 5లక్షల92వేల రూపాయలతో పాటు, 684.5 గ్రాముల బంగారు నాణాలు,150 గ్రాముల బంగారు ఆభరణాలు,ఒక కారు సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్, రసీదు పుస్తకాలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, చెక్ బుక్స్, స్టాంప్స్ తో పాటు పొలాలు, ఇంటి స్థలాలకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల వివరాలు :

1.తెప్పాలి సైదులు, తండ్రి పేరు బిక్షం, వయస్సు 55, స్వగ్రామం గడ్డి పల్లి, సూర్యాపేట జిల్లా. ప్రస్తుత నివాసం పాలకుర్తి మండల కేంద్రం, జనగామ జిల్లా.

2. మనుబోతుల రామకృష్ణ, తండ్రి పేరు సాయిరామ్, వయస్సు 36, నందిగామ, కృష్ణ జిల్లా, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుత నివాసం పాలకుర్తి మండల కేంద్రం, జనగామ జిల్లా.

3. పొడిల సురేష్ కుమార్, తండ్రి పేరు వెంకటనర్సయ్య, వయస్సు 35, స్వగ్రామం పెన్ పహాడ్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత నివాసం, పాలకుర్తి, జనగామ జిల్లా.

4.పొడిల శ్రీధర్, తండ్రి ఆంజనేయులు, వయస్సు 30, స్వగ్రామం హుజూర్ నగర్, సూర్యాపేట జిల్లా, ప్రస్తుత నివాసం పాలకుర్తి, జనగామ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.

ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెబ్సిబా సంస్థ పేరుతో చీటీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ చిట్టీ లో చేరే వారు ముందుగా ఆరు వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు చెల్లించిన డబ్బులో నాలుగు వేలు తన వద్దనే డిపాజిత్ చేసుకొని మిగితా రెండు రెండు వేల రూపాయలకు సభ్యులకు ఈ సంస్థపై నమ్మకం నమ్మకం కలిగేందుకు సభ్యులకు రెండు వేల రూపాయల విలువ వస్తువులను అందజేస్తాడు. వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం మూడు వందలు మాత్రమే వుంటాయి. ఈ సంస్థ లో ఒక సభ్యుడు ఎన్ని సభ్యత్వాలైన పొందవచ్చు. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బు ను తిరిగి అందజేసేవాడు. ప్రధాన నిందితుడు మిగితా నిందితులతో కలసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని సుమారు 28, 493 సభ్యత్వాలను నమోదు చేసుకోవడంతో పాటు వీరి నుండి 4వేల రూపాయల చొప్పున మొత్తం 11 కోట్ల39 లక్షల రూపాయలు ప్రజల డబ్బు ను తన వద్దనే భద్రపరుచుకొని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అదే కాకుండా నిందితుడు సభ్యులకు కేవలం మూడు వందల రూపాయల విలువ వస్తువులను అందజేయడం ద్వారా మరో4కోట్ల 84లక్షలు మోసం చేశాడు. ఈ ముఠా 17 బ్యాంకుల్లో జమ చేసిన 5కోట్ల 48 లక్షల, 64 వేల రూపాయలకు బ్యాంక్ ఖాతాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులు, సిబ్బందిని సీపీ అభినందించారు.

 

 

Exit mobile version