మేడారంలో లైంగిక దాడి ఆరోపణలు..జాతీయ మహిళా కమిషన్ సీరియస్

మేడారంలో రేప్ ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్! విచారణకు ఇద్దరు సభ్యుల బృందం. రాజకీయ కుట్ర అంటున్న పోలీసులు.. అసలేం జరిగింది?

Medaram Jatara Gang Rape Allegations

విధాత, ప్రత్యేక ప్రతినిధి: మేడారం జాతర సందర్భంగా సమ్మక్క గద్దెపైకి వచ్చిన గురువారం రోజు జంపన్నవాగు సమీపంలో ఓ మైనర్ బాలికపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారంటూ సాగుతున్న ప్రచారంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జాతర ముగిసిన తర్వాత ఆదివారం నుంచి కొన్ని వార్తాసంస్థలు, పలు సోషల్ మీడియా సైట్లలో ఈ వార్త వైరల్ అయ్యింది. ఈ కథనాలను సుమోటోగా తీసుకున్న నేషనల్ ఉమెన్ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తూ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయా రాహత్కర్ విచారణకు ఆదేశించారు. గురువారం నుండి ఈ ఆరోపణలపై విచారణ మొదలు కానున్నట్లు ప్రకటించారు. విచారణ కమిటీలో కమిషన్ సభ్యులు డెలినా,కంచన్ కట్టర్ ఉంటారని పేర్కొన్నారు. వీరికి జిల్లా లీగల్ సెల్ అథారిటీ సహకరిస్తుందని ప్రకటించారు.

ఆరోపణణలు నిరాధారం

మేడారం జాతరలో అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలను ములుగు పోలీసులు ఖండించారు. డాబర్ అమ్లా తూట్ పేస్ట్ దొంగతనం జరిగిందని చెబుతున్నారు. కాగా, బాలికపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు సరైనవి కావని స్థానిక అధికార పార్టీ నాయకులు ఇప్పటికే వ్యతిరేకించారు. జాతర పై దుష్ప్రచారం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు. తప్పుడు వార్తలతో మా చెల్లి జీవితాన్ని నాశనం చేయొద్దని బాలిక సోదరుడు సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. జాతరలో రేప్ జరిగిందన్న ప్రచారం పూర్తిగా అబద్ధమంటూ తప్పుడు ప్రచారంపైన కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. తనచెల్లి జీవితాన్ని అనవసరంగా నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ విచారణతోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ రూపంలోనైనా నిజానిజాలు బయటికొస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Chhattisgarh Encounter : ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హతం !
Gas Filled Balloons Explosion : లిఫ్టులో పేలిన‌ హైడ్రోజ‌న్‌ గ్యాస్ బెలూన్లు.. షాకింగ్ వీడియో

Latest News