Gas Filled Balloons Explosion : లిఫ్టులో పేలిన‌ హైడ్రోజ‌న్‌ గ్యాస్ బెలూన్లు.. షాకింగ్ వీడియో

లిఫ్ట్‌లో హైడ్రోజన్ గ్యాస్ బెలూన్లు పేలిన ఘటన ముంబైలో కలకలం రేపింది. ముగ్గురికి గాయాలు కాగా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Gas Filled Balloons Explosion : లిఫ్టులో పేలిన‌ హైడ్రోజ‌న్‌ గ్యాస్ బెలూన్లు.. షాకింగ్ వీడియో

బ‌ర్త్‌డే పార్టీలు, వెడ్డింగ్ డేలు ఇలా సెల‌బ్రేష‌న్ ఏదైనా.. బెలూన్స్ ఉండాల్సిందే. రంగురంగుల బెలూన్ల‌తో అందంగా డెకొరేట్ చేసి పార్టీలు చేసుకోవ‌డం ఇప్పుడు ఓ ఫ్యాష‌న్ అయిపోయింది. అది చిన్న పార్టీ అయినా, పెద్ద పార్టీ అయినా బెలూన్ డెకొరేష‌న్ మాత్రం మ‌స్ట్‌. అయితే, ఒక్కోసారి ఆ బెలూన్ల వ‌ల్ల ప్రాణాలు పోయే ప‌రిస్థితి కూడా వ‌స్తుంది. అందుకు నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న‌.

ప్ర‌స్తుతం యువ‌త‌ పార్టీ అన‌గానే గ్యాస్ నింపిన హైడ్రోజ‌న్ బెలూన్ల‌ను (gas-filled balloons) వాడేందుకే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఎందుకంటే సాధార‌ణ బెలూన్ల కంటే అవి అందంగా, ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి కాబ‌ట్టి. అయితే, వాటి వ‌ల్ల చాలా ప్ర‌మాదం ఉంటుంది. ఒక్కోసారి అవి ఉన్న‌ట్టుండి పేలిపోతాయి. అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఇప్పుడు జ‌రిగింది.

లిఫ్ట్‌లో పేలిన బెలూన్లు..

మ‌హారాష్ట్రంలోని ముంబై (Mumbai)కి స‌మీపంలో ఉన్న‌గోరేగావ్ (Goregaon) ప్రాంతంలోని అమోల్ ట‌వ‌ర్‌లో ఓ బ‌ర్త్‌డే పార్టీ కోసం గ్యాస్ బెలూన్లు ఆర్డ‌ర్ ఇచ్చారు. డెలివ‌రీ బాయ్ ఆ బెలూన్ల‌ను తీసుకొని వ‌చ్చారు. వాటిని లిఫ్ట్‌లో తీసుకెళ్లేందుకు య‌త్నించారు. లిఫ్ట్‌ ఎక్క‌గానే ఆ బెలూన్లు ఒక్క‌సారిగా భారీ శబ్దంతో పేలిపోయాయి. ఆ స‌మ‌యంలో లిఫ్ట్‌లో ఓ మ‌హిళ కూడా ఉంది. ఈ ఘ‌ట‌న‌లో డెలివ‌రీ బాయ్ రాజ్ కుమార్‌, మ‌రోవ్య‌క్తితోపాటు హిమ‌నీ ప్రియ అనే విద్యార్థిని గాయ‌ప‌డ్డారు.

ముగ్గురికి గాయాలు..

భారీ శ‌బ్దం రావ‌డంతో అపార్ట్‌మెంట్ వాసులు భ‌య‌ప‌డిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ వ‌ద్ద‌కు ప‌రుగున వెళ్లి చూడ‌గా.. ముగ్గురూ కాలిన గాయాల‌తో అల్లాడిపోతూ క‌నిపించారు. వెంట‌నే వారిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి తర‌లించారు. మ‌రోవైపు స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని ప‌రిస్థితిని ప‌రిశీలించారు. హైడ్రోజ‌న్ గ్యాస్ నింపిన బెలూన్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని తెలిసిన‌ప్ప‌టికీ ఎలాంటి జాగ్ర‌త్త చ‌ర్య‌లూ తీసుకోకుండా డెలివ‌రీ బాయ్‌తో బెలూన్ల‌ను పంపిన షాప్ ఓన‌ర్ జైశ్వాల్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

నెటిజ‌న్లు ఏమంటున్నారంటే..

లిఫ్ట్‌లో బెలూన్‌లు పేలిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. అది చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. ఇలాంటి బెలూన్లు వాడే స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. వీటి కంటే సాధార‌ణ బెలూన్లు వాడితే మంచిద‌ని మ‌రికొంద‌రు స‌ల‌హాలు ఇస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

world largest python| ప్రపంచంలోనే అతిపెద్ద కొండ చిలువ దొరికేసింది!
TGPSC Group 1 exam| గ్రూప్-1 ఉద్యోగాలు పొందిన అభ్యర్ధులకు హైకోర్టు ఊరట