Sri Ramanavami | శ్రీరామనవమి( Sri Ramanavami ) పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు హిందువులంతా( Hindu ) సిద్ధమవుతున్నారు. సీతారాముల కల్యాణానికి( Sitaramula Kalyanam ) ఆలయాలు( Temples ) కూడా ముస్తాబవుతున్నాయి. శోభాయాత్రలు( Shobhayatra ) నిర్వహించేందుకు పల్లెలు, పట్టణాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమాల్లో భక్తులు( Devotees ) బిజీ అయిపోయారు.
అయితే ప్రతి ఏడాది వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి( Sri Ramanavami )ని జరుపుకుంటారు. అభిజిత్ లఘ్నంలో జగదేక వీరుడికి, జగన్మాత సీతాదేవికి అత్యంత వైభవోపేతంగా కల్యాణ వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీరామ భక్తులు( Lord Srirama ) తమ మొక్కులను చెల్లించుకుంటారు. అదే విధంగా కోరికలు కూడా కోరుతుంటారు. అయితే భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలంటే.. శ్రీరాముడిని ఈ పూలతో పూజిస్తే తప్పకుండా నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి శ్రీరాముడిని ఏ పూలతో పూజిస్తే ఏ కోరికలు నెరవేరుతాయో చూద్దాం.
మల్లెపూలు
మల్లెపూలు ప్రతి ఇంట్లో ఉంటాయి. కాబట్టి ఈ పూలతో శ్రీరామనవమి రోజున శ్రీరాముడిని పూజిస్తే.. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
గన్నెరు పూలు
గన్నెరు పూలు కూడా గ్రామాల్లో, పట్టణాల్లో కనిపిస్తుంటాయి. విద్యార్థుల్లో మేధాశక్తి పెరగాలన్నా, కవుల కల్పనాశక్తి పెరగడానికి, సాహిత్య రంగంలో రాణించాలంటే గన్నేరు పూలతో సీతారాములను పూజించాలని సూచిస్తున్నారు.
పారిజాత పుష్పాలు
చాలా మంది కాలసర్ప దోషాలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు నవమి రోజు పారిజాత పుష్పాలతో స్వామి వారిని పూజిస్తే సమస్త సమస్యలు తొలగిపోతాయట.
జాజిపూలు
నవమి రోజు దశరథ రాముడిని జాజిపూలతో పూజిస్తే, మనలో ఉన్న దుష్ట గుణాలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే ఉద్యోగం తొందరగా లభిస్తుందని వివరిస్తున్నారు.
సంపెంగ పూలు
శత్రువులు ఎక్కువగా ఉన్నవారు శత్రు బాధలు తొలగిపోవాలంటే రామనవమి రోజు రామయ్యను సంపెంగ పూలతో పూజించాలని చెబుతున్నారు.
పద్మ పుష్పం
శ్రీమంతులు కావాలంటే, ఐశ్వర్యం సిద్ధించాలన్నా పద్మ పుష్పాన్ని రాములవారికి సమర్పించి నమస్కారం చేసుకుంటే మంచిదంటున్నారు.
నందివర్ధన పూలు
ఇంట్లో సుఖశాంతులు ఉండాలన్నా, మనశ్శాంతి లభించాలన్నా నందివర్ధన పూలతో పూజించాలని చెబుతున్నారు. ఇలా రామనవమి రోజు రామయ్యను ఒక్కో పువ్వుతో పూజిస్తే ఒక్కో ఫలితం లభిస్తుందని చెబుతున్నారు.