Rajnath Singh | సరిహద్దులు మారవచ్చు.. సింధ్‌ భారత్‌లోకి తిరిగి రావచ్చు : రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్

పాకిస్థాన్ దేశంలోని సింధూ భూ భాగం తిరిగి భారత్ లో కలిసే అవకాశం ఉందని, దీంతో సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్, విధాత : పాకిస్థాన్ దేశంలోని సింధూ భూ భాగం తిరిగి భారత్ లో కలిసే అవకాశం ఉందని, దీంతో సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ భూ భాగం భారతదేశంలో భాగం కాకపోవచ్చని, సాంస్కృతికంగా, నాగరికంగా భారత్ లో ఎల్లప్పుడూ భాగమేనన్నారు. ఎవరికి తెలుసు భవిష్యత్తులో సింధూ తిరిగి భారత్ లోకి కలవ వచ్చని ఆయన అన్నారు. సింధూ నదిని పరమ పవిత్రంగా భావించే సింధూ ప్రాంత ప్రజలు ఎల్లప్పుడు మన దేశ సొంతమేనని అన్నారు. వారు ఎక్కడ ఉన్నా ఎప్పుడూ మన పక్షమే ఉంటారని ఆయన పేర్కొన్నారు. సింధూ ప్రాంతంలోనే కాదు మన దేశంలో కూడా సింధూ నదిని పవిత్రంగా భావిస్తున్నారు. ముస్లింలు కూడా మక్కాలోని అబ్ ఏ జంజం జలాల కంటే ఎక్కువగా సింధూ జలాలను గౌరవిస్తారన్నారు.


ఢిల్లీలో లో ఆదివారం నాడు జరిగిన సింధి కమ్యూనిటీ సదస్సులో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. పాకిస్థాన్ లోని సింధూ నదికి దగ్గరలో సింధూ ప్రావిన్స్ ఉందని, 1947 లో దేశ విభజన సందర్భంగా పాకిస్థాన్ కు వెళ్లిందన్నారు. సింధూ ప్రాంతం పూర్తిగా హిందువులకు చెందిననది, దీన్ని పాకిస్థాన్ లో కలపడాన్ని బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ తో సింధీలు ఎంతమాత్రం అంగీకరించలేదన్నారు. ఈ విషయాన్ని అద్వానీ తన పుస్తకంలో రాశారన్నారు. సెప్టెంబర్ 22వ తేదీన మొరాకో దేశంలో భారతీయులను ఉద్ధేశించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) పై రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కారణంగా సునాయసంగా భారత్ దేశంలోకి పీఓకే ను విలీనం చేసుకోవచ్చన్నారు. పీఓకే మనదే అవుతుందని, అక్కడ కూడా భారత్ లో విలీనం చేయాలనే డిమాండ్లు మొదలైనట్లు మీరు కూడా వింటున్నారని రాజ నాథ్ సింగ్ అన్నారు.

Read Also |

Two WhatsApps for iPhone | ఐఫోన్​ యూజర్లకు శుభవార్త : ఎట్టకేలకు ఐఫోన్​లో రెండు వాట్సప్​లు
Telangana Tourism : 22 నుండి సాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం
Bad Memories | కలచివేసే చెడు జ్ఞాపకాలను ఇలా తుడిచివేయచ్చు!
Nepal Gen-Z Protest : నేపాల్‌లో మళ్లీ జన్-జడ్ ఆందోళనలు

 

Latest News