Cloves | ఒత్తిడి కారణంగానో.. ఆర్థిక సమస్యల కారణంగానో.. భర్తలు( Husbands ) భార్యల( Wifes )పై రుసరుసలాడటం సహజం. ఇవి పక్కన పెడితే.. చాలా మంది మగాళ్లు తమ భార్యలను అనుమానిస్తుంటారు. అంతేకాదు.. వారిని వేధింపులకు గురి చేస్తూ హింసిస్తుంటారు. దీంతో భార్యాభర్తల మధ్య విబేధాలు( Disputes between Couples ) ఏర్పడుతాయి. ఈ విబేధాలు విడాకుల( Divorce ) దాకా కూడా దారి తీస్తాయి. మరి ఇలాంటి దంపతుల వివాహ బంధం( Married Life ) బలోపేతం కావాలంటే ఒక చిన్న జ్యోతిష్య పరిహారం పాటిస్తే సరిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం..
భార్యాభర్తల మధ్య విబేధాలు ఏర్పడితే.. భార్య నిత్యం పూజలు చేస్తూ తన భర్త మంచి భర్తగా మారాలని వేడుకుంటుంది. ఇందుకోసం అనేక పూజలు చేస్తుంటుంది. తమ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేయమని దేవుళ్లను ప్రార్థిస్తుంటుంది. అయితే భర్త చేతిలో నిత్యం అవమానాలకు, అనుమానాలకు గురయ్యే భార్య ఈ చిన్న పరిహారం చేస్తే సమస్య పరిష్కారమవుతుందట. ఆ పరిహారం ఏంటంటే.. శనివారం నాడు భార్య తన కుడి చేతిలో 21 లవంగాలు( Cloves ) ఉంచుకుని, తన భర్త పేరును 21 సార్లు ఉచ్చరించాలి. అనంతరం ఆ లవంగాలను తీసి పూజగదిలో భద్రపరచాలి. ఆదివారం తెల్లవారుజామునే స్నానం ఆచరించి.. ఆ 21 లవంగాలను తీసుకుని పచ్చ కర్పూరంలో వేసి వెలిగించాలి. ఇలా ఎనిమిది శనివారాలు క్రమం తప్పకుండా చేస్తే.. భర్త భార్యను అనుమానించడం, అవమానించడం పక్కనపెట్టి.. ఆమెతో అన్యోన్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఎనిమిది శనివారాల తర్వాత కూడా భార్యకు తగిన ఫలితం రాకపోతే.. ఈ ప్రయత్నాన్ని కనీసం మూడు సార్లు పునరావృతం చేయమని పండితులు సూచిస్తున్నారు. దీంతో పాటు పడక గదిలో ప్రేమ చిహ్నాలను ఉంచేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి గురువారం సీతారాముల ఆలయానికి వెళ్లి ప్రసాదం సమర్పించాలి. అదే రోజు తులసి మొక్కకు పసుపు నీటిని పోయాలి. పడక గదిలో పసుపు రంగు దుస్తులు ధరిస్తే కూడా శుభం కలుగుతుందట. వీటన్నింటితో పాటు భార్యాభర్తలు “ఓం నమః శివాయ” లేదా “ఓం క్లిం కృష్ణాయ నమః” వంటి మంత్రాలను జపించాలి అని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.