Bath | స్నానంతోనూ డ‌బ్బు సంపాదించొచ్చు..!

Bath | మీరు డ‌బ్బు( Money ) సంపాదించ‌లేక‌పోతున్నారా..? సంపాద‌నంతా నీళ్ల‌లా ఖ‌ర్చు అవుతుందా..? అప్పులు( Debts ) పెరిగిపోతున్నాయా..? అయితే మీరు కేవ‌లం స్నానం( bath )తోనే డ‌బ్బు సంపాదించొచ్చు. అదేలాగో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Bath | జ్యోతిష్యాన్ని న‌మ్మే ప్ర‌తి వ్య‌క్తి త‌న ఇంటిని వాస్తు నియ‌మాల‌కు( Vastu Tips ) అనుగుణంగా నిర్మించుకుంటారు. చెప్పుల స్టాండ్ నుంచి మొద‌లుకుంటే.. నిద్రించే ప‌డ‌క‌గ‌ది( Bed Room ) వ‌ర‌కు ప్ర‌తి విష‌యంలోనూ వాస్తు నియ‌మాల‌ను పాటిస్తుంటారు. అయినా కూడా వారిని ఆర్థిక క‌ష్టాలు( Financial Problems ) వెంటాడుతూనే ఉంటాయి. డ‌బ్బు( Money ) నిల‌వ‌దు. అప్పులు( Debts ) కుప్ప‌లు తెప్ప‌లుగా పేరుకుపోతాయి. మాన‌సికంగా ధైర్యాన్ని కోల్పోతారు. ఇలా నిత్యం ఆర్థిక క‌ష్టాల‌తో బాధ‌ప‌డేవారు కేవ‌లం స్నానంతోనే డ‌బ్బు సంపాదించే మార్గాలు ఉన్నాయి. అందుకు ఈ వాస్తు చిట్కా పాటిస్తే స‌రిపోతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏంటో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి రోజు స్నానం చేస్తారు. స్నానం అనంత‌రం ఇంట్లోనే పూజ‌లు చేస్తుంటారు. చేతినిండా డ‌బ్బు ఉండాల‌ని దేవుళ్ల‌ను వేడుకుంటారు. ఇదంతా మంచిదే కానీ.. స్నానం చేసిన‌ప్పుడు ఈ మూడింటిని నీటిలో క‌లిపి చేస్తే.. ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి చేతి నిండా డ‌బ్బు ఉంటుంద‌ని వాస్తు పండితులు చెబుతున్నారు.

సైంధవ లవణం

ప్ర‌తి ఇంటి వంట గ‌దిలో సైంధ‌వ ల‌వ‌ణం ఉంటుంది. ఇది ఇంట్లోని ప్ర‌తికూల శ‌క్తిని తొల‌గిస్తుంది. అయితే ఇంత‌టి శ‌క్తిని ఉన్న ఉప్పును స్నానం చేసే స‌మ‌యంలో నీటిలో వేసుకోవాలి. ఉప్పును క‌లిపిన నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల ప్ర‌తికూల శ‌క్తులు తొల‌గిపోయి అనుకూల శ‌క్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. నీటి ప్ర‌వాహం మాదిరి ఇంట్లోకి డ‌బ్బు ప్ర‌వ‌హిస్తుంది. మొత్తంగా ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ని పండితులు చెబుతున్నారు.

బిర్యానీ ఆకు

బిర్యానీ ఆకు అనేది కేవలం సుగంధ ద్రవ్యమే కాదు.. వాస్తు శాస్త్రంలో కూడా దీనికి అనేక నివారణలను కలిగి ఉంది. స్నానపు నీటిలో బిర్యానీ ఆకును జోడించి ఆ నీటితో స్నానం చేయడం వల్ల అన్ని ప్రతికూలతలు తొలగిపోతాయి. ఇది ఇంటికి ఆర్థిక ఆశీర్వాదాలను తెస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.

లవంగాలు

ఆయుర్వేదంలో ల‌వంగాల‌ను విరివిగా ఉప‌యోగిస్తారు. అంతేకాకుండా వంట‌కాల్లోనూ ఈ ల‌వంగాల‌కు డిమాండ్ ఎక్కువే. వాస్తు శాస్త్రంలోనూ ల‌వంగాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంది. మీరు ప్రతిరోజూ మీ స్నానపు నీటిలో ఒక లవంగాన్ని జోడించి దానితో స్నానం చేస్తే అది అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ప్రతికూలతలు తొల‌గిపోయి, ఆర్థిక క‌ష్టాలు మాయ‌మ‌వుతాయి. చేతి నిండా డ‌బ్బు స‌మ‌కూరుతుంది.

Latest News