Cumin | శుక్రవారం జీలకర్ర దానం చేయండి..! ఆర్థిక స్థిరత్వం పొందండి..!!
Cumin | దిగువ, మధ్య తరగతి కుటుంబాలు నిత్యం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూనే ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం( Financial Stability ) పొందలేక.. జీవించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి వారు తమ జీవితాన్ని జీలకర్ర( Cumin )తో మార్చుకోవచ్చు. ప్రతికూల శక్తులను( Negative Energies ) తొలగింపజేసుకుని ఆర్థిక స్థిరత్వం పొందొచ్చు. అదేలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
Cumin | మన వంట గదిలో మసాలా దినుసులతో పాటు కూడా జీలకర్ర( Cumin ) కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను ఇస్తుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జీలకర్ర.. జీవితానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ముఖ్యంగా ఆర్థిక స్థిరత్వం( Financial Stability ) పొందడానికి, ప్రతికూల శక్తులను( Negative Energies ) తొలగించుకోవడానికి జీలకర్ర సాయపడుతుంది. జీవితాన్ని జీలకర్రతో ఎలా మార్చుకోవచ్చు తెలుసుకుందాం.
ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు..
శుక్రవారం నాడు జీలకర్రను దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. జీలకర్రను దానం చేయడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు వర్థిల్లుతాయట. ఇక కొద్దిగా జీలకర్రను తీసుకుని ఎర్రటి వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా బీరువాలో ఉంచితే సంపద ఊహించని విధంగా పెరుగుతుందట. అలాగే అనవసర ఖర్చులు తగ్గి.. ఆర్థిక స్థిరత్వం పొందేందుకు సాయం చేస్తుందట.
లక్ష్మీ కటాక్షం కోసం..
ఇక చాలా మంది నివాసాల్లో డబ్బు నిలవ ఉండదు. ఇలాంటి వారు లక్ష్మీ కటాక్షం పొందాలంటే.. శుక్రవారం నాడు ఈ చిన్న చిట్కా పాటిస్తే సరిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా జీలకర్రను చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పకుండా ఉంటే ఫలితం కూడా ఎక్కువగా ఉంటుందట.
అప్పుల బాధల నుండి విముక్తి..
తీరని అప్పులతో సతమతమవుతున్న వారు కూడా ఒక ప్రత్యేక పరిహారం పాటించాలి. కొన్ని పచ్చి జీలకర్ర గింజలను తీసుకుని, ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్లి అక్కడ మట్టిలో పాతిపెట్టాలి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనస్సులో రుణ విముక్తి కావాలని శని దేవుడిని ప్రార్థించాలి. దీనివల్ల క్రమంగా కొత్త ధన మార్గాలు తెరుచుకుంటాయని, అప్పుల నుండి బయటపడతారని నమ్ముతారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram