Solar Eclipse | ఈ ఏడాది మహాలయ అమావాస్య( Mahalaya Amavasya ) రోజున సూర్యగ్రహణం( Solar Eclipse ) ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం.. కన్యారాశి( Virgo )లో, ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో సంభవిస్తుంది. ఆ సమయంలో శని తిరోగమనంలో ఉంటాడు. దీంతో కొన్ని రాశుల వ్యక్తులకు పట్టిందల్లా బంగారమే( Gold ) అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారు కోట్లకు పడగలెత్తడం ఖాయమని అంటున్నారు. మరి ఆ నాలుగు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సూర్యగ్రహణం తర్వాత వృషభ రాశి వారి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికీ ఎప్పటికీ ఊహించని విధంగా వారి తలరాత మారబోతుంది. ఇప్పటి వరకు చూడని అద్భుతాలను భవిష్యత్‌లో చూడబోతున్నారు. చేపట్టిన ప్రతి పని విజయవంతమవుతుంది. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం తన్నుకువస్తుంది. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు గడిస్తారు. దీంతో కోటీశ్వరులైపోతారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహ రాశి వారి జీవితంలో కూడా సూర్యగ్రహణం పెనుమార్పులు తీసుకురాబోతుంది. చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. దీంతో ఆదాయం కూడా అమాంతం పెరుగుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి అనువైన సమయం ఇది. సంపద కూడా రెట్టింపు అవుతుంది. ఊహించని స్థాయిలో డబ్బు సంపాదించడంతో.. కోట్ల రూపాయాలు వెనుకేసుకునే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారమే కానున్నది.
ఈ సూర్య గ్రహణం తర్వాత తులా రాశి వారికి ఇప్పటి వరకు వెంటాడిన సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కొత్తగా భూమిని కొనే అవకాశం ఉంది. ఈ రాశి వారు కోట్లలో డబ్బులు సంపాదించడం ఖాయం. అంటే వీరు డబ్బును ఎక్కువగా పొదుపు చేస్తారు. ఆరోగ్యం బాగుటుంది. పట్టిందల్లా బంగారమే కానుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఇంటా బయట సానుకూల ప్రభావం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. చాలా ఆనందంగా గడుపుతారు.
ఈ సూర్యగ్రహణం ఆదివారం సెప్టెంబర్ 21వ తేదీ, 2025న సంభవిస్తుంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం., ఈ గ్రహణం దాదాపు రాత్రి 10:59 నుంచి తెల్లవారుజామున 3:23 (సెప్టెంబర్ 22) వరకు ఉంటుంది. అంటే ఈ సంఘటన అర్థరాత్రి నుంచి మర్నాడు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో నేరుగా కనిపించకపోయినా.. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు.