విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం విచారణ కొనసాగించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. కడియం శ్రీహరి అడ్వొకేట్ ను వివేకానంద అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
నిన్న శుక్రవారం దానం నాగేందర్ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ వర్సెస్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్లపై స్పీకర్ విచారణ నిర్వహించారు. ఇద్దరు పిటినర్ల తరుపు అడ్వకేట్లను దానం నాగేందర్ తరపు అడ్వకేట్ క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. సరైన ఎవిడెన్స్ లేకపోవడంతో విచారణను స్పీకర్ గడ్డం ప్రసాద్ మార్చి 2వ తేదీకి వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి :
HPV Vaccination : దేశ వ్యాప్తంగా హెచ్ పీవీ టీకా పంపిణీ ప్రారంభం
Gold Silver Price Today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
