లక్ష్మీదేవీ( Lakshmi Devi ) అనుగ్రహం ఉంటే.. ఆ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఏదో ఒక రూపంలో ఆ ఇంటికి ధన ప్రవాహం ఉంటుంది. అయితే శుక్రుడి సంచారం బాగున్నప్పుడే లక్ష్మీదేవీ అనుగ్రహం లభిస్తుంది. అయితే మిగిలిన గ్రహాల సంచారంపై కూడా జాతక ఫలితాలు ఆధారపడి ఉంటాయని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు. శుక్రుడి సంచారంతో పాటు మిగిలిన గ్రహాలు కూడా ఈ మూడు రాశుల వారికి నాలుగు నెలల పాటు శుభ ఫలితాలను అందిస్తున్నాయి. అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెల వరకు ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వెన్నంటే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఊహించని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మరి ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం..
కర్కాటకం (Cancer)
ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు…ఈ నాలుగు నెలలు కర్కాటక రాశివారికి అదృష్టం కలిసొస్తుంది. జీవితంలో పురోగతికి మంచి అవకాశాలుంటాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి.
సింహం (Leo)
ఈ రాశివారికి కూడా ఈ నెల నుంచి నవంబరు వరకూ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. అయితే ఖర్చులు నియంత్రించాల్సిన సమయం ఇది.
ధనుస్సు (Sagittarius)
ఆగష్టు నుంచి రానున్న 4 నెలల పాటూ ధనస్సు రాశివారికి అత్యంత ప్రయోజకరంగా ఉండబోతోంది. గ్రహాల శుభసంచారంతో పాటూ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మారుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారులకు శుభసమయం.