Zodiac Signs | సంక్రాంతి త‌ర్వాత ఈ నాలుగు రాశుల‌కు రాజయోగం..! ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!!

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం గ్ర‌హాల క‌ద‌లిక‌, సంచారం ఆయా రాశుల‌పై ప్ర‌భావం చూపిస్తాయి. ఈ క్ర‌మంలో గ్ర‌హాలు కాలానుగుణంగా త‌మ రాశుల‌ను, న‌క్ష‌త్రాల‌ను మార్చుకోవ‌డం వ‌ల్ల 12 రాశుల‌పై ప్ర‌తికూల‌, అనుకూల ప్ర‌భావాలు ఉంటాయి. అయితే సంక్రాంతి త‌ర్వాత ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారు రాజ‌యోగం( Raja yogam ) పొంద‌నున్నారు. వీరు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

Zodiac Signs | ఈ ఏడాది సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) జ‌న‌వ‌రి 15న వ‌చ్చింది. పండుగ మ‌రుస‌టి రోజు అంటే 16వ తేదీన కుజుడు ప్ర‌త్యేక శుభ సంచారం చేయ‌బోతున్నాడు. శ‌ని రాశి అయిన మ‌క‌ర రాశిలోకి కుజుడు( Mars ) ప్ర‌వేశించ‌బోతున్నాడు. శ‌ని, కుజుల అరుదైన క‌ల‌యిక వ‌ల‌న‌.. ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి అమిత‌మైన శుభాలు క‌ల‌గ‌నున్నాయి. అంతేకాదు.. వీరికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోనున్నాయి. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేషరాశి అధిపతి కుజుడు. అందుకే ఈ గ్రహ సంచారం వీరికి శుభప్రదంగా భావిస్తారు. వీరికి ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి పవిత్ర తీర్థయాత్ర చేపట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలిక సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ఈ రాశివారి జీవితంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. పిల్లల విషయంలో ఆనందంగా ఉంటారు. కొత్త భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.

కర్కాటకం (Cancer)

కుజ సంచారం కార‌ణంగా కర్కాట‌క రాశి వారికి శుభ ఫ‌లితాలు క‌ల‌గ‌నున్నాయి. అదృష్టం త‌లుపు త‌ట్ట‌నుంది. చేసే ప్ర‌తి ప‌నిలోనూ విజ‌యం సాధిస్తారు. ప‌ని చేసే ప్ర‌దేశంలో ప‌దోన్న‌తులు ల‌భించ‌డ‌మే కాదు.. అద‌న‌పు, కొత్త బాధ్య‌త‌లు చేప‌డుతారు. వ్యాపార‌వేత్త‌ల‌కు శుభ స‌మ‌యం.. ఆర్థికంగా ఎదుగుతారు. లాభాలు ఆర్జిస్తారు.

మకరం (Capricorn)

కుజ సంచారంతో ఈ రాశి వారికి అనుకూల ఫలితాలను అందుతాయి. మీరు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆర్థిక అడ్డంకులు తొల‌గిపోయి కొత్త ఆదాయ వనరులు ఏర్ప‌డుతాయి. దాంతో ఆర్థిక లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

తులా( Libra )

తులా రాశి వారు కుజ సంచారం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. భూమి, భవనాల నుంచి ప్రయోజనాలుంటాయి. కొత్త వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీకు అకస్మాత్తుగా డబ్బు అందుతుంది.

Latest News