విధాత : ఇరాన్ అనుకూల ర్యాలీలు చేస్తున్న వారిని వెంటనే ఇరాన్ పంపించి వేయాలని బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో ఆయన మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి పట్ల హైదరాబాద్ లో ఎంఐఎం ర్యాలీలు చేయడం ఏమిటంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై మండిపడ్డారు. ఓవైసీకి అంత అభిమానం ఉంటే ఇరాన్ వెళ్లి ఆ దేశ సైన్యంతో కలిసి యుద్ధం చేయాలని, కావాలంటే నేనే ఓవైసీకి ఫ్లైట్ టికెట్లు కొనిస్తానంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సహా భారత్ లో ఇరాన్ అనుకూల ర్యాలీలు చేస్తున్న వారిని వెంటనే ఇరాన్ పంపించేయాలన్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో హిందూ జనజాగృతి సమితి నిర్వహించిన హిందూ ధర్మ సభలో రాజాసింగ్ మాట్లాడారు. ఇరాన్‌కు అనుకూలంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీస్తున్న వారిని గుర్తించి, వారిని వెంటనే దేశం నుంచి ఇరాన్‌కు పంపించేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇక్కడి ప్రజల మధ్య విద్వేషాలు నింపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
