మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. మీ కృషికి గుర్తింపు లభిస్తుంది. సరైన ప్రణాళికతో ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. కీలక వ్యవహారాల్లో నిదానం వహించండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక సంఘటనతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. కొత్త అవకాశాలను ఆహ్వానించండి. కీలక నిర్ణయాలలో స్పష్టతతో వ్యవహరించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో శుభవార్తలు వింటారు. క్రమశిక్షణ, సమయానుకూల నిర్ణయాలతో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించండి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే విజయం సిద్ధిస్తుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. ఆదాయం, ఇతర ఆర్థిక వనరుల పెరుగుదలకు అవకాశం ఉంది. ప్రయాణాలలో ప్రమాదాలుండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు అందుకుంటారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగితే మేలు జరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఏ ఒక్కపని కూడా సానుకూలంగా జరగదు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. కుటుంబ సభ్యులతో విబేధాలు అశాంతి కలిగిస్తాయి. అధిక ధనవ్యయానికి అవకాశం ఉంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సర్వత్రా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. వ్యాపారులు మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అనుకోని ధనలాభాలు ఉంటాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ కృషి ఫలిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. మిత్రుల సహకారంతో అదనపు ఆదాయ వనరులు ఏర్పరచుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. బంధు మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. క్లిష్టమైన వ్యవహారాల్లో సహనం, ఓర్పుతో అద్భుత ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవాలి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, ఉల్లాసభరితంగా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల ప్రశంసలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార రంగంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎంత గట్టిగా కృషి చేస్తే అంత శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక లాభాలు ఉత్సాహాన్నిస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు ఫలవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.