Horoscope | గురువారం రాశిఫ‌లాలు.. ఈ రాశి అవివాహితుల‌కు క‌ల్యాణ‌యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. కీలక నిర్ణయాలలో స్పష్టత పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. ధర్మసిద్ధి ఉంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు, శత్రుజయం ఉంటాయి. కీలక నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగేయాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. దూరదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ఖ్యాతి నలువైపులా విస్తరిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అదనపు ఆదాయం లభిస్తుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట ఘర్షణ పూరిత వాతావరణం ఉండవచ్చు. అధికారులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దిగవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఆటంకాలకు నిరాశ చెందవద్దు. దైవబలంపై విశ్వాసం ఉంచండి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞులను సంప్రదిస్తే మంచిది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పని ప్రదేశంలో దూకుడు తగ్గించుకుని సామరస్యంగా ఉంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. కుటుంబ వ్యహారాల్లో సహనం, శాంతి అవసరం. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. మీ ప్రతిభకు, సమర్ధతకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొన్ని పరిస్థితులు ఇబ్బంది కలిగిస్తాయి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలతో నష్టం వాటిల్లుతుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో వివాదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అవివాహితులకు కల్యాణ యోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థిక లాభాలు కూడా ఆశించిన విధంగా ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన సంకల్పంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మధ్యస్థ ఫలితాలు ఉండవచ్చు. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు మిత్రుల సహాయంతో పెట్టుబడులు సమకూర్చుకుంటారు.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో అందరినీ కలుపుకొని పోవడం వలన సమస్యలుండవు. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో మెలిగితే ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

Latest News