మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజంతా అనేక శుభప్రదమైన సంఘటనలతో నిండి ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్తగా ఏర్పడే పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆర్థికంగా మేలైన సమయం. ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెట్టుబడులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభాలకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవచ్చు. అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. పట్టుదల, ఏకాగ్రతతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాల్లో అందరిని కలుపుకుని ముందుకు పోవడం వలన సత్ఫలితాలు ఉంటాయి. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని వ్యతిరేక పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యాపారులు ఈ రోజు తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలు సంభవించే సూచనలున్నాయి. పెట్టుబడులు, స్పెక్యూలేషన్లకు ఈ రోజు అనుకూలం కాదు. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండండి. పెద్దలతో సౌమ్యంగా మాట్లాడడం మంచిది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు మీరు అనుకున్నట్లుగా జరగకపోవచ్చు. వృత్తి పరమైన వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. వ్యాపారులు భాగస్వాముల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలహాలకు అవకాశం ఉంది. నూతన వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలిస్తోంది. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. అనేక మార్గాల నుంచి ధనలాభాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో అనుబంధాలు దృఢపడతాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శుభప్రదమైన భవిష్యత్తు గోచరిస్తోంది. మీ వాక్చాతుర్యంతో, సత్ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మీ కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థికంగా అద్భుతమైన రోజని చెప్పవచ్చు. గతంలో ఇబ్బంది పెట్టిన సమస్యలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి, కార్యజయం ఉంటాయి. సమాజంలో గొప్పవారిని ప్రేరణగా తీసుకుంటారు. స్ఫూర్తిదాయకమై అంశాలతో ప్రభావితం అవుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అందరినీ కలుపుకుని పోవడం వలన విజయం సునాయాసంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఆర్థికంగా ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు. పెట్టుబడులు విపరీతమైన లాభాలు అందిస్తాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. వ్యాపారంలో కృషితో లాభాలు పెరుగుతాయి. ప్రియమైన వారితో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అధిక ఖర్చులకు అవకాశం ఉంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు సంతోషదాయకంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని ఆర్థిక లాభాలతో ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. కీలక నిర్ణయాల విషయంలో స్పష్టత ఉండేలా చూసుకోండి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరైన ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిది. ఆస్తి వ్యవహారాల్లో ప్రతికూలతలు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సానుకూల ఫలితాలు పొందవచ్చు. ప్రియమైన వారితో కలహాలు అశాంతి కలిగిస్తాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
