మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బలమైన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు అందిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనవసరమైన వ్యయాలు ఎక్కువ కావచ్చు. డబ్బును పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి అనువైన సమయం.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నత పదవి యోగం ఉంది. స్థిరమైన నిర్ణయాలతో ఆర్థిక ప్రగతి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. జీవిత భాగస్వామితో చేసే విహారయాత్ర చాలా సంతోషాన్నిస్తుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి పరంగా, ఆర్ధికంగా అనేక ప్రయోజనాలు అందుకుంటారు. నూతన అవకాశాలకు ఆహ్వానం పలుకుతారు. అవివాహితులకు కళ్యాణయోగం ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా గడుపుతారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పట్టుదలతో ప్రయత్నిస్తే ఆటంకాలు తొలగుతాయి. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యలు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో విశేషమైన ధనలాభాలు ఉండవచ్చు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వల్ప ప్రయత్నంతోనే ప్రారంభించిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. వ్యాపారులకు ఒక లావాదేవీల్లో ఊహించని ధనలాభం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో ఆహ్లాదకరమైన పర్యటనలు చేస్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. మంచి శుభ సమయం నడుస్తోంది. మీ కోరికలు, ఆశయాలు అన్నీ నెరవేరుతాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆర్థికంగా శ్రేష్టమైన సమయం. రుణభారం తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికం అవుతుంది. గత తప్పిదాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. కుటుంబ సభ్యులతో ఘర్షణలకు, వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడవచ్చు. సంతానం పురోగతి ఆందోళన కలిగిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తోటివారి సహకారంతో ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలు, చట్టపరమైన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఒక దుర్వార్త విచారం కలిగిస్తుంది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ సత్ఫలితాలు రాబట్టుతారు. ఆర్థికంగా సమయం అనుకూలిస్తోంది. నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇష్టకార్యసిద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రతిభతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వృత్తి పరమైన సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక సమస్యను పరిష్కరిస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. అధికారుల మెప్పు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అవమానకర సంఘటనలకు, అపకీర్తి వచ్చే సందర్భాలకు దూరంగా ఉండండి. శత్రుబలం పెరగవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. ఖర్చులు అదుపు చేయండి.
