Site icon vidhaatha

Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఆర్థికంగా శుభ‌ఫ‌లితాలు..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. సమయానుకూలంగా ముందుకెళ్తే సత్ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. ముఖ్యమైన నిర్ణయాల్లో దూకుడు తగ్గించుకుంటే మంచిది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభకాలం నడుస్తోంది. ఎంతటి కఠినమైన పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. అదృష్టం కలిసివస్తుంది. గొప్ప విజయాలు సాధిస్తారు. వ్యాపారులు నూతన అవకాశాలు అందుకుంటారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నతస్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో అవరోధాలు క్రమంగా తొలగిపోతాయి. అవసరానికి డబ్బు అందుతుంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. లక్ష్యసాధనలో కీలక మైలురాయికి చేరుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు అనుకూలమైన సమయం. మీ ప్రతిభకు గుర్తింపు, సత్కారాలు పొందుతారు. సంతానం పురోగతి ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా జాగ్రత్త వహించాలి. ఉన్నతాధికారులతో వినయంగా నడుచుకుంటే మంచిది. కొన్ని సంఘటనలతో మానసిక ఒత్తిడి కలుగుతుంది. ప్రియమైన వారితో విభేదాలు రాకుండా చూసుకోండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల సంకేతాలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తొలగించుకోండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కుటుంబంతో పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తారు. శారీరకంగా మానసికంగా ఆనందంగా వుంటారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం వుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి నిరుత్సాహం కలిగిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డబ్బు నష్టపోయే ప్రమాదముంది. సంపద, ప్రతిష్ఠకు నష్టం కలిగే ప్రమాదముంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలతో చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు శుభసమయం. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు పైఅధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. మార్కెటింగ్, సేవా రంగంలో ఉన్నవారికి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి.

Exit mobile version