విధాత : జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది వెళ్తున్న ఓ ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు గాయపడ్డారు. భదేర్వాహ్-చంబా రోడ్డులోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
200అడుగుల లోయలో పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన వారిని ఉధంపుర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
Naini Coal Block Tender | నైని బొగ్గు గనుల రద్దుపై విచారణ కమిటీ వేసిన కేంద్రం
KTR : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ నోటీసులు!
