విధాత : కేంద్ర విద్యాశాఖ అద్వాన్న పనితీరుకు, నిర్లక్ష్యానికి అద్దం పట్టింది సీబీఎస్ఈ 12వ తరగతి క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ ను ఓ విద్యార్థిని స్కాన్ చేస్తే నేరుగా యూ ట్యూబ్ సాంగ్ ఓపెన్ కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేంద్ర విద్యా శాఖ పనితీరు ఎంత ‘చెత్త’గా ఉందో అంటూ ఆ విద్యార్థిని ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
సీబీఎస్ఈ 12వ తరగతి గణిత పరీక్ష ప్రశ్నాపత్రంలో.. ఒక యూట్యూబ్ పాటకు సంబంధించి క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఆ విద్యార్థినికి సంబంధించిన ప్రశ్రపత్రంలోని క్యూఆర్ కోడ్ ను తన ఫోన్ స్కానర్ తో ఓపెన్ చేస్తే యూ ట్యూబ్ సాంగ్ ఓపెన్ అయ్యింది. అయితే అన్ని ప్రశ్నపత్రాల్లో ఇలాగే ఉందా.. లేక ఈ ఒక్క పేపర్ లోనే ఇలా వచ్చిందా అన్నది తెలియరాలేదు. పరీక్షల నిర్వహణలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అని ఆ విద్యార్థిని సెటైర్లు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది.
In today’s episode of how serious our examination conducting authorities are- presenting to you CBSE class 12th board maths paper which has a QR code that opens rickroll’s song on YouTube 🤷🏿♂️ pic.twitter.com/gvQcsVvGVp
— Nehr_who? (@Nher_who) March 9, 2026
ఇవి కూడా చదవండి :
Mango Map | బంగినపల్లి నుంచి ఆల్ఫోన్సో వరకు.. భారత్‌లో దొరికే 14 మామిడి రకాల సీజన్ మ్యాప్ వైరల్!
Vegetables Cultivation | నెలకు 3000 కిలోల కూరగాయలు పండిస్తున్న యువ రైతు.. ఆదాయం రూ. 2 లక్షలకు పైనే..
