మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా కీలక సమావేశాల్లో పాల్గొని మీ ప్రతిభను చాటుతారు. వ్యాపారంలో పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థికంగా నూతన అవకాశాలు మెరుగవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో కృషికి తగిన ఫలితం దక్కుతుంది. దైవానుగ్రహంతో ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరత్వం సాధిస్తారు. ఆర్థిక పరిసితి మెరుగ్గా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిప్రదేశంలో గుర్తింపు కోసం తీవ్రంగా శ్రమిస్తారు. సమయానుకూల నిర్ణయాలతో ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు అందుకునే అవకాశం ఉంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. సమయస్ఫూర్తి, చాకచక్యంతో వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కీలక సమావేశాల్లో చక్కగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అద్భుతమైన రాజయోగం గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు తిరుగుండదు. స్వయంకృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. లక్ష్మీకటాక్షంతో ధనసంపదలు పెరుగుతాయి. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడంతో ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా పరిస్థితులు చాలా అనుకూలంగా ఉండవచ్చు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహంలో శుభప్రదమైన వాతావరణం ఉంటుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ఏ పని ప్రారంభించినా విజయం వెన్నంటే ఉంటుంది. లక్ష్మీకటాక్షంతో సంపదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈరోజు అదృష్టకరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. దైవబలం అనుకూలంగా ఉన్నందున ఆర్థికంగా గొప్ప లాభాలు ఉంటాయి. ప్రారంభించిన పనులు విజయవంతంగా సకాలంలో పూర్తిచేస్తారు. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. బుద్ధిబలంతో అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. ఆర్థికంగా పొదుపు అవసరం. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ఆర్థికంగా, వృత్తిపరంగా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సేవా రంగంలో పని చేసే వారికి ఈ రోజు ఆర్థికంగా బాగుంటుంది. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు వస్తాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. స్థిరాస్తి వ్యాపారులకు ఈ రోజు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అన్ని రకాల ఆర్ధిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది.
