మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఆర్థిక లాభాలు అందుకుంటారు.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో స్థిరమైన నిర్ణయాలతో పురోగతి సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచి తూచి నడుచుకోవాలి. ఆర్థిక నష్టాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతో సహనంతో మెలగాలి. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వృత్తి పరంగా, ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. శుభవార్తలు అందుకుంటారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన పని ఇప్పుడు పూర్తవుతుంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా అభివృద్ధికి చెందిన శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉండవచ్చు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త పడండి. వ్యాపారంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. ఒక సంఘటన మీ మనోబలాన్ని దెబ్బ తీస్తుంది. కుటుంబ సభ్యులతో సమన్వయ ధోరణితో మెలగాలి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. అదృష్టం వరిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యాపారులు చక్కగా రాణిస్తారు. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. మీ మాటకు విలువ, గుర్తింపు పెరుగుతాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో విజయాన్ని సాధిస్తారు.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో మెరుగైన పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. నలుగురు గుర్తించేలా మీ అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఈ రోజు శుభసూచకంగా ఉంది.