Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి నూత‌న గృహ‌, వాహ‌న యోగం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధి బలంతో చేసే పనులు త్వరగా నెరవేరుతాయి. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగులకు స్థానచలన సూచనలు ఉన్నాయి. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే సందర్భాలకు దూరంగా ఉంటే మంచిది. ఖర్చులపై నియంత్రణ అవసరం.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వేడుకలు జరుగుతాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. విదేశీ బంధువుల నుంచి శుభ సమాచారం వింటారు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొందరి ప్రవర్తన మనస్థాపం కలిగిస్తుంది. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కాకూండా ఖర్చులు అదుపు చేయండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఒత్తిడి కలిగిస్తాయి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆందోళన, కంగారు తగ్గించుకుని ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. స్వయంకృషితో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, వెంచర్సు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే రోజు. పెద్ద పెద్ద సంస్థలలో పెట్టుబడులు పెట్టడానికీ , షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికీ ఇది అనుకూలమైన సమయం.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఆలస్యం కావచ్చు. నిరాశకు నిస్పృహలకు లోను కాకుండా ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. తొందరపాటుతో, త్వరపడి నిర్ణయాలు చేయకండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఏకాగ్రతతో, చిత్తశుద్ధితో పనిచేసి ఉద్యోగ వ్యాపారాల్లో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటారు. ఒక తీర్థయాత్రకు అవకాశం ఉంది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా, వృత్తి పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహాల అనుకూలతతో ఈ రోజు వరాల జల్లు కురుస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో ఆదాయం పెరగడం వల్ల, వ్యాపారంలో లాభాలు రావడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. పితృ సంబంధమైన లబ్ధి ఉండవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభ సమయం నడుస్తోంది. ఈ రోజు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన ఒప్పందాలు చేయడానికి ఇది సరైన రోజు. అన్ని రంగాల వారికి ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. ఆర్థికంగా గొప్ప శుభయోగాలుంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన మనసుతో ముందుకు సాగితే ప్రారంభించిన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సహోద్యోగులతో, పై అధికారులతో జాగ్రత్తగా నడుచుకోండి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అనేక మార్గాల నుంచి ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా బలోపేతం అవుతారు. దూరప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ సృజనాత్మకతకు, ప్రతిభకు పురస్కారాలు అందుకుంటారు. నూతన గృహ, వాహన యోగాలున్నాయి.

Latest News