Alekya Tarakaratna | తారకరత్నతో ప్రేమ, కుటుంబ విభేదాలు.. మొదటిసారి మనసు విప్పిన అలేఖ్య రెడ్డి

Alekya Tarakaratna | నందమూరి కుటుంబానికి చెందిన నటుడు నందమూరి తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. ఒక్క సినిమాతోనే ఆయనపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు నందమూరి కుటుంబం నుంచి మరో స్టార్ హీరో వచ్చారని అప్పట్లో సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

Alekya Tarakaratna | నందమూరి కుటుంబానికి చెందిన నటుడు నందమూరి తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో సంచలనం సృష్టించారు. ఒక్క సినిమాతోనే ఆయనపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో పాటు నందమూరి కుటుంబం నుంచి మరో స్టార్ హీరో వచ్చారని అప్పట్లో సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొదటి సినిమా విడుదలైన వెంటనే తారకరత్న ఒకే రోజు తొమ్మిది సినిమాలను ప్రారంభించి రికార్డు సృష్టించారు. అయితే తర్వాత ఆయన సినీ ప్రయాణంలో విజయాలు, పరాజయాలు రెండూ ఎదురయ్యాయి. కొంతకాలం తర్వాత ఆయన క్యారెక్టర్ పాత్రలు, విలన్ పాత్రల వైపు కూడా మళ్లారు.

ఇక గత ఎన్నికల ముందు తారకరత్న రాజకీయంగా కూడా యాక్టివ్ అయ్యారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. అయితే అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. తర్వాత కోమాలోకి వెళ్లి 2023 ఫిబ్రవరిలో కన్నుమూశారు. ఆయన మృతి నందమూరి కుటుంబంతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ నేపథ్యంలో తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తన వ్యక్తిగత జీవితంపై మొదటిసారి స్పందించారు. యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహకు ఇచ్చిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తారకరత్నతో తన ప్రేమ కథ, పెళ్లి, కుటుంబ పరిస్థితుల గురించి పలు విషయాలను వెల్లడించారు. అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ, తారకరత్నను పెళ్లికి ముందే చాలా కాలంగా తెలుసని తెలిపారు. తమ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని చెప్పారు. కొంతకాలం తర్వాత తారకరత్ననే తనకు ప్రేమను వ్యక్తం చేశారని వెల్లడించారు. అయితే అప్పటికే తన మొదటి భర్తతో విడిపోయిన నేపథ్యంలో వెంటనే పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన తనకు లేదని చెప్పారు.

మొదట తారకరత్న ప్రపోజల్‌ను తాను తిరస్కరించానని, తర్వాత తన తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాతే ఆ విషయాన్ని సీరియస్‌గా ఆలోచించానని తెలిపారు. అనంతరం ఇద్దరి కుటుంబాలతో మాట్లాడిన తర్వాత తాను కూడా పెళ్లికి అంగీకరించానని చెప్పారు. అయితే ఈ పెళ్లికి తారకరత్న కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు. కుటుంబ పెద్దలు వ్యతిరేకించినప్పటికీ తారకరత్న తన ప్రేమ కోసం నిలబడి, చివరకు సంఘీ టెంపుల్‌లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. పెళ్లి తర్వాత కూడా తారకరత్న తల్లిదండ్రులు తమతో దూరంగా ఉన్నారని ఆమె తెలిపారు.

తారకరత్న మరణించిన తర్వాత పిల్లల కోసం అయినా కుటుంబ సభ్యులు దగ్గరవుతారని తాను ఆశించానని చెప్పారు. అయితే ఇప్పటివరకు అలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. అయినప్పటికీ భవిష్యత్‌లో తప్పకుండా కుటుంబ సభ్యులు కలుస్తారని, తమను అంగీకరిస్తారని నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన జీవితంలో పిల్లలే ప్రధానమని, వారినే చూసుకుంటూ జీవితం ముందుకు సాగిస్తున్నానని అలేఖ్య రెడ్డి చెప్పారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, వారితో కలిసి సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని వెల్లడించారు.

అలాగే నందమూరి కుటుంబంలో కొందరు మాత్రం తనతో టచ్‌లోనే ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ, షర్మిలతో పాటు వైఎస్ విజయసాయి రెడ్డి తనకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి తనకు తండ్రిలాంటి వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ తనను బాగా చూసుకుంటారని అలేఖ్య రెడ్డి పేర్కొన్నారు.

Latest News