Bala Krishna | NBK111తో మాస్ ట్రీట్ రెడీ.. బాలయ్య కోసం థమన్ అదిరిపోయే ఐటెం సాంగ్!
Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
Bala Krishna | నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న NBK111 ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొల్పుతున్న ప్రాజెక్టులలో ఒకటిగా మారింది. ‘వీరసింహారెడ్డి’ తర్వాత ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.
ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు స్పెషల్ ఐటెం సాంగ్ షూటింగ్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఈ పాట కోసం సంగీత దర్శకుడు ధమన్ కంపోజ్ చేసిన ట్యూన్ ఇండస్ట్రీ వర్గాల్లోనే కాకుండా అభిమానుల్లో కూడా భారీ చర్చకు దారితీస్తోంది.
ఐటెం సాంగ్ ప్లాన్..
‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ చిత్రాల్లో బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, బీట్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు NBK111 కోసం కూడా అదే స్థాయిలో పవర్‌ఫుల్ మాస్ ఐటెం నెంబర్ సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ సినిమాలో ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఈ సాంగ్ షూట్‌కు సంబంధించిన సెట్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ అరవింద్ కశ్యప్ షేర్ చేసిన ఓ స్టైలిష్ పిక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. సెట్స్ డిజైన్, లైటింగ్ ప్యాటర్న్, విజువల్ టోన్ చూస్తుంటే సినిమా భారీ గ్రాండియర్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఆ సన్నివేశాలు కీల ఆకర్షణగా..
గోపీచంద్ మలినేని గత చిత్రాల్లో మాస్ ఎలివేషన్స్‌ను హ్యాండిల్ చేసిన తీరు తెలిసిందే. ఈసారి కూడా బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సముద్రఖని– బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు కీలక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇప్పటికే షూట్ చేసిన కొన్ని ఎపిసోడ్ల అవుట్‌పుట్‌పై మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని టాక్.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ‘భగవంత్ కేసరి’ తర్వాత బాలయ్య – కాజల్ జోడీ మళ్లీ తెరపై కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గత చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి స్పందన రావడంతో NBK111లో కూడా వారి ట్రాక్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. కాజల్ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో భావోద్వేగాలను మోసేలా ఉంటుందని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram