Shiv Pratap Shukla| తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం

తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు సీజే అపరేశ్ కుమార్ సింగ్ గవర్నర్ ఎస్పీ శుక్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు.

Telangana Governor

విధాత, హైదరాబాద్ : తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు సీజే అపరేశ్ కుమార్ సింగ్ గవర్నర్ ఎస్పీ శుక్లాతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

గవర్నర్ శివ ప్రతాప్ ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,    శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శుక్లాకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తో సీఎం, మంత్రులు గ్రూప్ ఫోటో దిగారు.

ఇటీవల గవర్నర్ల మార్పులో భాగంగా కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న శివప్రతాప్ శుక్లాను తెలంగాణ గవర్నర్ గా నియమించింది. ఆయన తెలంగాణ రాష్ట్రానికి 5వ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు గవర్నర్‌గా పనిచేసిన జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీ అయ్యారు.

ఇవి కూడా చదవండి :

రైతుల మధ్య ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రమోషన్స్.. వినూత్నంగా సినిమా ప్రచారం
Hyderabad Hotels | వంట గ్యాస్ కొర‌త‌.. మ‌రో 48 గంట‌ల్లో హైద‌రాబాద్‌లో హోట‌ల్స్ బంద్..!

Latest News