Debt | అప్పు చేసి పప్పుకూడు తినకు అనే సామెత అందరికీ తెలిసిందే. కానీ అప్పు( Debt ) ఇచ్చే వాడు ఉంటే.. వేలల్లో కాదు.. లక్షలు, కోట్లల్లో కూడా అప్పులు చేస్తుంటారు. ఇక ఇచ్చేవాడు కూడా వడ్డీ వస్తుంది కదా అని చెప్పి.. అడిగినంత ఇచ్చేస్తుంటాడు. తిరిగి వసూలు చేసేటప్పుడే అసలు కథ మొదలవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి వసూలు చేసేందుకు చెప్పులు అరిగేలా తిరుగుతారు. అయినా కూడా డబ్బులు తిరిగి రావు. అయితే ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి అప్పుల విషయంలో ఇలాంటి స్వభావమే ఉంటుందని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. ఈ నాలుగు రాశుల వారికి అప్పు ఇస్తే.. జన్మలో కూడా తిరిగి వసూలు చేసుకోలేరని చెబుతున్నారు. మరి ఇంతకీ ఆ నాలుగు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారు ముఖ్యంగా విలాసాలను అమితంగా ఇష్టపడుతారు. ఇక విలాసాలు చేసేందుకు అప్పులు కూడా ఆ స్థాయిలోనే చేస్తుంటారు. కనీసం తమ వద్ద డబ్బుల్లేవు కదా అని వెనుకడుగు వేయనే వేయరు. ఇచ్చేవాడు ఉంటే.. ఎంతైనా తీసుకుంటారు. ఇక ఆ డబ్బును తిరిగి ఇచ్చే సమయంలోనే చుక్కలు చూపిస్తుంటారు. ఎందుకంటే డబ్బు ఇస్తే తమ పొదుపు తగ్గిపోతుందని భయపడి, అప్పు తీర్చడాన్ని వాయిదా వేస్తూ ఉంటారు.
మిథున రాశి (Gemini)
మిథున రాశి వారు సాధారణంగానే మాటకారి మనషులు. ఇక వీరు ఎదుటి వారిని మాటల్లో పెట్టి.. అప్పులు ఈజీగా చేసేస్తుంటారు. అంతేకాదు వీరి దగ్గర డబ్బు ఉన్నప్పటికీ, ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. అప్పు తీర్చాలనే విషయాన్ని కొన్నిసార్లు మర్చిపోతారు లేదా సరైన ప్లానింగ్ లేక డబ్బును ఇతర అవసరాలకు వాడేస్తారు. అప్పు ఇచ్చిన వ్యక్తిని అనేక ఇబ్బందులకు గురి చేస్తారు.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఆశావాదులు. కంటికి కనిపించిన ప్రతీ వస్తువు తమ సొంతం కావాలని ఆశపడుతుంటారు. అంతేకాదు విలాసవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటారు. అందుకు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అప్పులు చేసి ఎంజాయ్ చేస్తారు. ఇక అప్పుల విషయంలో వీరు చాలా ఉదాసీనంగా ఉంటారు. డబ్బు ఎక్కడికి పోతుందిలే.. తర్వాత ఇద్దాం అనే వీరి వైఖరి అప్పు ఇచ్చిన వారికి చికాకు కలిగిస్తుంది.
మీన రాశి (Pisces)
భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే మీన రాశి వారు ఆర్థిక విషయాల్లో కాస్త వీక్. వీరు తమ డబ్బును ఎక్కడ ఖర్చు చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేరు. తీరా అప్పు తీర్చే గడువు వచ్చేసరికి, వీరి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. కఠినమైన ఆర్థిక వాస్తవాల కంటే ఊహాజనిత ప్రపంచంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
