మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. అధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. కొత్తగా ప్రారంభించబోయే పనులు వాయిదా వేస్తే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా స్థిరమైన పురోగతి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు కలగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాలలో అశ్రద్ధ వద్దు. ఖర్చుల విషయంలో తెలివిగా వ్యవహరించాలి. కొన్ని ఘటనలు మానసిక ఆందోళనకు కారణమవుతాయి.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు వృత్తి పరంగా బాగా కలిసి వస్తుంది. వృత్తిపరంగా విశేషమైన ఆర్థిక లాభం ఉంటుంది. వ్యాపారంలో కూడా ఊహించని లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం ఏదైనా, అంతటా విజయమే! వృత్తిపరమైన అభివృద్ధి, పదోన్నతి ద్వారా ఆదాయం వృద్ది జరుగుతుంది. మిత్రుల ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. శుభవార్తలు వింటారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజు కళాకారులకు, రచయితలకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభకు పురస్కారాలు, గుర్తింపు అందుకుంటారు. చక్కని ప్రణాళికతో ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చర్చలు, సమావేశాలలో చక్కగా రాణిస్తారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలున్నాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాల్లో ఆచి తూచి అడుగేయాలి. కొత్త కార్యక్రమాలు వాయిదా వేస్తే మంచిది. ఇంటా బయట కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతియుతంగా ఉంటే మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ముందుచూపుతో ఉంటే నష్టాలు తగ్గుతాయి. లేకుంటే ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి ఆలోచనలతో ముందుకు సాగి విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగుతుంది. ధనవ్యయం పెరిగే సూచన ఉంది.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీ అంచనాలకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్తగా ప్రారంభించే పనులలో శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ముందుచూపుతో వ్యాపారంలో నష్టాలు నివారించవచ్చు. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు.