అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు మీకు తెలుసా?

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హక్కులు లేవనుకుంటున్నారా? సమాన వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటి కీలక హక్కులపై అవగాహన పెంచుకోండి. కొత్త కార్పొరేషన్‌తో చేకూరనున్న భద్రత.

Outsourcing-employees

విధాత, హైదరాబాద్ : అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటేనే భద్రత లేని ఉద్యోగం.. తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిదని, ఏజెన్సీలు, ఉన్నతాధికారులకు కమిషన్ల మార్గాలు అన్న విమర్శలు వినిపిస్తుంటాయి. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొన్ని చట్టపరమైన ప్రత్యేక రక్షణలు ఉన్నాయన్న సంగతి చాలమందికి తెలియదు. అయితే వాటి అమలుకు సరైన యంత్రాంగం లేకపోవడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంగా మారింది.

అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఓ ప్రభుత్వ శాఖ నేరుగా నియమించుకోవడం, లేక ఓ థర్డ్ పార్టీ(ఏజెన్సీ) ద్వారా సిబ్బందిని నియమించుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో మధ్యవర్తుల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం APCOS (Andhra Pradesh Corporation for Outsourced Services) కార్పొరేషన్(ద్వారా నియామకాలు, వేతనాలు అందిస్తోంది. తెలంగాణలో వివిధ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. ఇటీవల ఏపీ తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా టీజీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్(Telangana Outsourcing Corporation) ఏర్పాటుకు నిర్ణయించింది. దీంతో వారికి వేతనాలు సక్రమంగా అందడంతో పాటు ఈపీఎఫ్, ఈఎస్ఐ కచ్చితంగా అమలు కానుంది. తద్వారా తెలంగాణలోని దాదాపు 5లక్షల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగునుందని అంచనా వేస్తున్నారు.

* అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు ఇవే *

1. సమాన పనికి సమాన వేతనం (Equal Pay for Equal Work):
సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం, రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన బాధ్యతలు నిర్వర్తించే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం (Minimum Wage) ఇచ్చే విషయంలో వివక్ష ఉండకూడదు.

2. సామాజిక భద్రత (EPF & ESI):
ప్రతి అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీ తన ఉద్యోగులకు EPF (Provident Fund) మరియు ESI (Health Insurance) సౌకర్యాలు కల్పించాలి. జీతం నుండి కట్ చేసిన PF మొత్తాన్ని ఏజెన్సీ సక్రమంగా డిపాజిట్ చేస్తోందో లేదో ప్రతి నెలా చెక్ చేసుకోవాలి.

3. వేతనం పంపిణీ:
ప్రభుత్వం ఇచ్చే నిధుల నుండి ఏజెన్సీలు కమిషన్ తీసుకోవచ్చు, కానీ ఉద్యోగికి రావాల్సిన జీతంలో కోత విధించడం చట్టవిరుద్ధం. వేతనం నేరుగా ఉద్యోగి బ్యాంక్ అకౌంట్‌లోనే పడాలి.

4. సెలవులు (Leave Benefits):
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా వారంతపు సెలవులు, పండుగ సెలవులు మరియు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు (Maternity Leaves) పొందే హక్కు ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

KTR SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ తో ఎలక్ట్రోరల్ బాండ్లు : కేటీఆర్ కు సిట్ ప్రశ్నలు?
US Withdraws From WHO | ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా..కరోనా ఎఫెక్ట్

Latest News