మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన కాలం కొనసాగుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో సత్ఫలితాలు ఉంటాయి. బంధు మిత్రుల సహకారంతో కీలక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారు చేపట్టిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి వ్యాపారంలో శుభయోగాలున్నాయి. అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులు సమయపాలన, క్రమశిక్షణతో సత్ఫలితాలు సాధించవచ్చు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన ఆటంకాలు, సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగవచ్చు. ఏకాగ్రతతో పనిచేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు తగ్గిస్తే మంచిది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. పదోన్నతి సూచన ఉంది. ఆర్థికంగా ఉన్నతస్థితి ఉంటుంది. కీలక వ్యవహారాల్లో శుభ పరిణామాలు సంతోషం కలిగిస్తాయి.
కన్య (Virgo)
కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి నిపుణులకు, వ్యాపారులకు ఈ రోజు అద్భుతమైన రోజు. వృత్తి పరంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆర్థికంగా విశేషమైన శుభ ఫలితాలున్నాయి.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో శుభ వార్తలు వింటారు. భూ, గృహ, వాహన యోగాలున్నాయి. నలుగురిలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని ఆర్థిక లాభాలు అందుకుంటారు.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. స్నేహితులు, బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో వినయంగా నడుచుకోవాలి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశముంది. శత్రువులను ఓ కంట కనిపెట్టి ఉండండి.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మీ కఠిన శ్రమకు, అద్భుత ప్రణాళికకు గుర్తింపు రాకపోవడంతో నిరాశ చెందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనలు విడిచి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. దూరదృష్టితో భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలు అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. మనోధైర్యంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు వివాహం జరిగే అవకాశం వుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రారంభిన పనుల్లో శుభ యోగాలున్నాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన వాహన యోగం ఉంది.