మేషం (Aries)
మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. చిన్న చిన్న సమస్యలు పెద్దవి చేసుకోకుండా పరిష్కరించుకుంటే మంచిది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఇబ్బందులు ఉండవచ్చు. ప్రశాంతంగా ఆలోచించి ముందుకెళ్తే కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది. ఉద్యోగాల్లో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ దైవబలంతో అధిగమిస్తారు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక వ్యహారాలపై పట్టు సాధిస్తారు. నూతన గృహయోగం ఉంది. ధన, కనక, వస్తు వాహనాలు చేకూరుతాయి. డబ్బు తెలివిగా ఖర్చు చేయండి. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధిస్తారు. కుటుంబంలో అనవసర కలహాలకు దూరంగా ఉంటే మంచిది.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అనుకూలత ఉంటుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలు చేపడతారు. పదోన్నతులు పొందుతారు. స్థానచలనం సూచన కూడా ఉంది. విదేశీ అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సత్ఫలితాలు ఉంటాయి. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం వల్ల లాభాలు పెరుగుతాయి. కీలక పెట్టుబడులు పెట్టడానికి అనువైన సమయం. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వైవాహిక జీవితంలో స్వల్ప ఒత్తిడి ఉన్నప్పటికీ సహనంతో ంటే అన్ని సర్దుకుంటాయి. నూతన వాహనయోగం ఉంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాలం అనుకూలంగా ఉంది. పట్టుదలతో పనిచేస్తే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టాలి. సహోద్యోగుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారు ఇంకొంతకాలం వేచి ఉండడం మంచిది. వ్యాపారంలో పురోగతి సామాన్యంగా ఉంటుంది. సరైన ప్రణాళిక, పట్టుదలతో కృషి చేస్తే ఆశించిన లాభాలు పొందవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఏర్పడే అపార్ధాలు అవగాహనతో సర్దుకుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారంలో శుభసూచనలు, లాభదాయకమైన మార్పులు ఉండవచ్చు. కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. సమిష్టి నిర్ణయాలతో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలున్నప్పటికీ పట్టుదలతో విజయం సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి ఉండవచ్చు. పొదుపు ప్రణాళికలతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తారు.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశాజనకమైన పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారంలో విజయ యోగం ఉంది. కొత్త ప్రాజెక్టులు, వెంచర్లు లాభాలు తెచ్చి పెడతాయి. పెట్టుబడులపై లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు శ్రమ పెరిగినప్పటికీ ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. పదోన్నతులకు అవకాశం ఉంది. ఆర్థికాభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. పలు మార్గాల్లో ఆదాయం విస్తరిస్తుంది. సౌమ్య సంభాషణతో శత్రువులు కూడా మిత్రులవుతారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెంచాలి.
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో చిన్నపాటి చిక్కులు ఎదురైనా త్వరగానే సమసిపోతాయి. ప్రారంభించిన పనుల్లో శ్రద్ధ, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు ఎదురవుతాయి. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరిగినప్పటికీ స్థిరత్వం లోపిస్తుంది. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి. ఉద్యోగులు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం అవసరం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో అపార్ధాలు కలహాలు సృష్టిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విహారయాత్రకు వెళ్తారు.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. ప్రత్యేకించి ఉద్యోగులు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. పని ప్రదేశంలో ఏరుపాటు తగదు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు ప్రస్తుతానికి వేచి చూడడం మంచిది. ఉద్యోగంలో ఉన్నత స్థానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరిగిన్నపటికి ఖర్చులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మొహమాటంతో చిక్కుల్లో పడతారు. రుణసమస్యలు పెరగకుండా చూసుకోండి. ప్రేమ వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు అవసరం. కుటుంబ సమస్యల కారణంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు. సహనంతో సమస్యలు పరిష్కరించుకోండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తెలివిగా ఖర్చు చేయండి.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. శ్రీలక్ష్మి కటాక్షం కలుగుతుంది. ఉద్యోగులు పని ప్రదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. నాయకత్వ లక్షణాలతో అధికార యోగం పడుతుంది. పదోన్నతులు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు అందుకుంటారు. గతంలోని ఆటంకాలు తొలగిపోతాయి. సమిష్టి కృషి సత్ఫలితాన్నిస్తుంది. దైవబలం అండగా ఉంటుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరగడంతో ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. నూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించండి. ప్రేమికుల మధ్య అపార్ధాలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. కొత్త పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు బలంగా ఉన్నాయి. ఉద్యోగులకు పని ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కృషికి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపు చేయండి. ప్రేమ వ్యవహారాల్లో అవగాహనతో ముందుకెళ్లడం మంచిది. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉండవచ్చు. సమయానుకూలంగా నడుచుకోవడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తిరిగి ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు ప్రయత్నించే విద్యార్థులు శుభవార్తలు వింటారు.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈ వారం కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోడానికి, నైపుణ్యాలు వృద్ధి చేసుకోడానికి అనువైన సమయం. స్థానచలనం సూచన ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో తెలివిగా వ్యవహరించాలి. ఆర్థికంగా అవసరానికి సరిపడా ధనం ఉన్నప్పటికీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలి. ప్రేమికుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న విభేదాలను నివారిస్తే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులు కెరీర్ను ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. సామాజిక సమావేశాలు, చర్చల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉద్యోగంలో బదిలీకి అవకాశం ఉంది. వ్యాపారులు వ్యాపార విస్తరణలో పురోగతి సాధిస్తారు. లాభాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రేమ వ్యవహారాల్లో స్పష్టతతో ముందుకెళ్తే మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న సమస్యలు వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుని ప్రశాంతంగా ఉంటే మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. సృజనాత్మకతతో ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారులు కఠోర శ్రమతో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి అనువైన సమయం. డబ్బుని తెలివిగా పెట్టుబడి పెట్టడం వలన ధనలాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన యోగం ఉంటుంది. అనేక మార్గాల నుంచి ధనప్రవాహం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యత ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
