Site icon vidhaatha

Sapt Mrittika | స్త్రీలు ‘స‌ప్త మృత్తికా బొట్టు’ ధ‌రిస్తే.. ఆర్థిక స‌మస్య‌లు తొలగిపోతాయ‌ట‌..!

Sapt Mrittika | స్త్రీ, పురుష అనే బేధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రికి స‌మ‌స్య‌లు ఉంటాయి. ఈ స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధానంగా ప్ర‌తి ఒక్క‌రిని వెంటాడేది ఆర్థిక స‌మ‌స్య‌( Financial Problems ). ఈ ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను శాశ్వ‌తంగా పార‌దోలేందుకు ప్ర‌తి ఒక్క‌రూ అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. మ‌రి ముఖ్యంగా మ‌హిళ‌లు( Woman ) ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ.. త‌మ‌కు ఆర్థిక క‌ష్టాల నుంచి విముక్తి క‌లిగించండి అంటూ వేడుకుంటారు. ఈ క్ర‌మంలో మ‌హిళ‌లు ఎన్నో పూజ‌లు, వ్ర‌తాలు చేస్తుంటారు. అయినా కూడా ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోవు.. అప్పులు వెంటాడుతూనే ఉంటాయి.

అయితే అదృష్టం త్వ‌ర‌గా క‌లిసి రావాలంటే స్త్రీలు ఈ ఒక్క ప‌ని చేస్తే.. ఆర్థిక క‌ష్టాల‌న్నీ మాయ‌మవుతాయ‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొన్ని ప‌రిహారాలు పాటించడం ద్వారా అదృష్టం కలిసి రావడమే కాకుండా ఆర్థిక సమస్యలు, కుజ, సర్ప దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయ‌ని పండితులు సూచిస్తున్నారు. మ‌రి ఆ ప‌రిహారాలు ఏంటో తెలుసుకుందాం.

మ‌హిళ‌ల‌కు, వారి ఇంటి య‌జ‌మానికి అదృష్టం క‌లిసి రావాలంటే.. నుదుటిన ధ‌రించే బొట్టు విష‌యంలో ఈ ప్ర‌త్యేక‌మైన ప‌రిహారాన్ని పాటించాల‌ని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ ప‌రిహారం ఏంటంటే.. స‌ప్త మృత్తికా బొట్టు. స‌ప్త మృత్తికా బొట్టు ఏంటి అని అనుమానం రావొచ్చు.. అదేంటంటే.. కాశీ, అయోధ్య, రుషికేశ్, హరిద్వార్, ప్రయాగ, గయ, త్రివేణి సంగమం అనే ఏడు ప్రదేశాల నుంచి కొద్దిగా మట్టిని సేకరించుకొని అవి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఆపై దాన్ని నుదుటిన బొట్టులా పెట్టుకొని దానిపై కుంకుమ బొట్టు ధరిస్తే అది సప్త మృత్తికా బొట్టు అవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక మహిళలు ప్ర‌తి రోజు ఈ ప్రత్యేకమైన బొట్టుని ధరించడం ద్వారా త్వరగా అదృష్టం పొందడమే కాకుండా అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ సప్త మృత్తికా బొట్టుని ధరించడం ద్వారా అదృష్టం కలిసి రావడమే కాకుండా ఏమైనా సర్ప దోషాలు, కుజ దోషం ఉంటే కూడా తొలగిపోతాయని పేర్కొంటున్నారు. బంధువులతో ఉన్న విబేధాలు, శత్రుబాధలు, రుణ బాధలు వంటివి కూడా తొలగిపోతాయట. ఆర్థిక వివాదాల నుంచి బయటపడడమే కాకుండా మంచి వ్యాపార వృద్ధి ఏర్పడుతుందట. అంతటి శక్తి ఈ సప్త మృత్తికా బొట్టుకు ఉంటుంద‌ని పండితులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Exit mobile version