Dreams | కలలు( Dreams ) దాదాపు రాత్రి వేళ వస్తుంటాయి. ఇక గతంలో జరిగిన సంఘటనలు కూడా కలల రూపంలో వస్తాయి. మనం ఊహించుకున్న విధంగా భవిష్యత్( Future )లో జరగబోయే వాటి గురించి కూడా కలలు పడుతుంటాయి. అయితే చాలా కలలు( Dreams ) నిద్ర లేచిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతుంటాయి. అలాంటి ప్రతి కల కూడా మనకు ఏదో మంచి లేదా చెడు జరగబోతుందని సూచిస్తుంది.
అయితే చాలా మందికి కలలోకి జంతువులు( Animals ) వస్తుంటాయి. జంతువులు కలలోకి రావడం శుభప్రదమని స్వప్న శాస్త్ర( Swapna Sastra ) నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు జంతువులు కలలోకి వస్తే ఆ వ్యక్తికి శుభం కలుగుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పేర్కొంటున్నారు. మరి ఆ మూడు జంతువులు ఏంటో తెలుసుకుందాం..
కుందేలు..( Rabbit )
కుందేలు.. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి కుందేలు కలలో కనిపిస్తే అది శుభ సంకేతం అని అర్థం చేసుకోవాలని స్వప్న శాస్త్రం చెబుతుంది. కుందేలు కలలో కనిపించడం వలన జీవితంలో ప్రేమ పెరుగుతుందట. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారట.
ఆవు..( Cow )
ఆవుకు హిందూ మతంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో మంది ఆవును పూజిస్తుంటారు. కలలో ఆవు కనిపిస్తే శుభ సంకేతమట. కలలో ఆవును చూడటం అంటే దేవుడు ఆ వ్యక్తిపై తన ఆశీర్వాదాన్ని కురిపించానున్నాడని అర్థమట. రానున్న రోజుల్లో మీరు చేపట్టిన ఏపనిలోనా విజయం సాధిస్తారని అర్థం.
ఏనుగు..( Elephant )
కలలో ఏనుగును చూడటం..ఏ వ్యక్తి అయినా తన కలలో ఏనుగును చూసినట్లయితే.. అతనికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం. ఈ కల ఆ వ్యక్తి సంపద, శ్రేయస్సును పొందుతాడని సూచిస్తుంది. ఈ కల ద్వారా త్వరలో జీవితంలో సుఖ సంతోషాలు కలగానున్నాయని తెలియజేస్తుందట.