Cow vs Leopard Fight : చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్‌ వీడియో

చిరుత మృత్యు పాశం నుంచి తృటిలో తప్పించుకున్న ఆవు! రాజస్థాన్ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్‌లో జరిగిన ఈ హోరాహోరీ పోరాటం వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్.

Cow vs Leopard Fight

సోషల్‌ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా మనకు తెలిసిపోతుంది. సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వస్తుంటాయి. అందులో కొన్ని స్ఫూర్తి నిచ్చేవి ఉంటే.. మరికొన్ని విషాద ఘటనలూ ఉంటాయి. తాజాగా ఆవు (Cow), చిరుత (leopard) ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో
ఒకటి తెగ వైరల్‌ అవుతోంది.

రాజస్థాన్‌లోని కోటాలో ముకుంద్రా హిల్స్‌ టైగర్‌ రిజర్వు (Mukundara Hills Tiger Reserve)లో ఆవుపై చిరుత దాడి చేసింది. అడవిలోని కొలిపుర ప్రాంతంలో మేత కోసం వచ్చిన ఆవును గమనించిన చిరుత.. అమాంతం దాని మెడను నోటికి కరిపించుకుని గట్టిగా పట్టుకుంది. ఇక చిరుత దాడి నుంచి
తప్పించుకునేందుకు ఆవు తీవ్రంగా ప్రయత్నించింది. తలను అటూ ఇటూ ఊపుతూ.. కొంతదూరం ముందుకు వెళ్లింది. చిరుత ఎంత గట్టిగా పట్టుకున్నా ఆవు తగ్గేదేలే అన్నట్లు ప్రతిఘటించింది.

చివరికి చేసేదేమీ లేక చిరుత వెనక్కి తగ్గింది. ఆవును వదిలిపెట్టి అడవిలోకి పారిపోయింది. దీంతో ఆ ఆవు ప్రాణాలు నిలిచాయి. ఈ దృష్యాలను అటుగా వెళ్తున్న వారు తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌
చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Hrithik Roshan | మాజీ భార్య, ప్రస్తుత ప్రియురాలు ఒకే ఫ్రేమ్‌లో .. హృతిక్ బర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ మాములుగా లేవుగా..!
Bhogi Festival | రేపే భోగి పండుగ‌..! భోగి మంట‌లు ఏ స‌మ‌యంలో వేయాలంటే..?

Latest News