Site icon vidhaatha

Vastu Tips | నెమ‌లి ఈకను ఇంట్లో ఉంచ‌డం శుభ‌ప్ర‌ద‌మేనా..? ఏ దిశ‌లో ఉంచితే మంచిది మ‌రి..!

హిందూ సంప్ర‌దాయం( Hindu Customs )లో నెమ‌లి ఈక‌( peacock feather )కు అత్యంత ప్రాధాన్య‌త ఉంది. దీంతో నెమ‌లి ఈక‌ల‌ను చాలా మంది త‌మ నివాసాల్లో ఉంచుకుంటారు. వ్యాపార స‌ముదాయ భ‌వ‌నాల్లోనూ నెమ‌లి ఈక‌ల‌ను ఉంచుతుంటారు. ఎందుకంటే ఇవి అందంగా, ఆక‌ర్షణీయంగా ఉండ‌డంతో పాటు సానుకూల శ‌క్తి( Positive Energy ) ని ఇస్తాయ‌మ‌నే న‌మ్మం. అంతేకాకుండా ఆర్థిక క‌ష్టాల‌( Financial Problems )ను కూడా నెమ‌లి ఈక‌లు తొల‌గిస్తాయ‌ట‌. ఎంతో శుభప్ర‌దంగా భావించే ఈ నెమ‌లి ఈక‌ల‌కు వాస్తు నియ‌మాలు ఉన్నాయి. ఇంట్లో కానీ, వ్యాపారం చేసే ప్రాంతంలో కానీ.. నెమ‌లి ఈక‌ల‌ను వాస్తు నియ‌మాల( Vastu Tips ) ప్ర‌కారం ఉంచాల‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మ‌రి నెమ‌లి ఈక‌ల‌ను ఏ దిశ‌లో ఉంచాలో తెలుసుకుందాం.

నెమ‌లి ఈక వాస్తు నియ‌మాలు..

నెమ‌లి ఈక‌ల‌కు వాయ‌వ్య దిశ అనుకూల‌మ‌ని వాస్తు పండితులు చెబుతున్నారు. ఈ దిశ‌లో నెమ‌లి ఈక‌ల‌ను ఉంచ‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ఉన్న శ్రేయ‌స్సు, ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ట‌.

ముఖ్యంగా పిల్ల‌లు చ‌దువుకునే గ‌ది( Study Room )లోనూ నెమ‌లి ఈక‌లు ఉంచ‌డం వ‌ల్ల వారిలో ఏక‌గ్రాత పెరిగి.. మంచి ర్యాంకులు, మార్కులు సాధించే అవ‌కాశం ఉంటుంద‌ట‌. పిల్ల‌ల్లో జ్ఞాప‌క‌శ‌క్తి కూడా మెరుగుప‌డుతుంద‌ట‌.

ఆర్థిక ఇబ్బందుల‌తో బాధ‌ప‌డేవారు.. నెమ‌లి ఈక‌ల‌ను ఇంట్లో లేదా వ్యాపార స్థ‌లంలో ఉంచాల‌ట‌. దాంతో ఆర్థిక క‌ష్టాలు తొల‌గిపోయి.. సంప‌ద పెరుగుతుంద‌ట‌. ఆర్థిక స్థిర‌త్వం ఏర్ప‌డుతుంద‌ట‌.

ఉత్తర దిశలో నెమలి ఈకలను ఉంచడం వల్ల వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అలాగే లాభాల అవకాశాలు కూడా పెరుగుతాయి. నెమలి ఈక వాస్తు దోషాలను తొలగించి ఇంటికి అదృష్టాన్ని తెస్తుంది.

ఎవరైనా కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే నెమలి ఈకపై కుంకుమతో “శ్రీ” అని రాసి పూజా స్థలంలో ఉంచండి. ఇంట్లో కూడా భద్రంగా ఉంచుకోవచ్చు. ఇలా చేయడం వలన సంపద పెరగడంతో పాటు, వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది.

 

Exit mobile version