Astrology | ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన తులా రాశి( Libra ) నుంచి శుక్రుడు( Venus ) వృశ్చిక రాశి( Scorpio )లోకి ప్రవేశించాడు. నవంబర్ 7వ తేదీ వరకు వృశ్చికంలోనే శుక్రుడు సంచరించనున్నాడు. విలాసాలకు, ఐశ్వర్యానికి, ఆనందానికి అధిపతి అయిన శుక్రుడి సంచారం జాతకంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సంపదను, విలాసాలను నిర్ణయిస్తాడని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే వృశ్చిక రాశిలో శుక్రుడి సంచారం చేయడం కారణంగా ఈ మూడు రాశులవారికి కష్టాలు తప్పవని పండితులు హెచ్చరిస్తున్నారు. ఆ మూడు రాశుల వారికి ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో ఉండదు. అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయట. మీ చుట్టూ మీకు తెలియకుండానే కుట్రలు జరిగే అవకాశం ఉందట. మరి ఆ మూడు రాశుల్లో మీ రాశి ఉందో..? లేదో..? చెక్ చేసుకోండి.
మేష రాశి ( Aries )
తొలి రాశి అయిన మేషంపై శుక్రుడి పరివర్తనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పరివర్తన సమయంలో ఉద్యోగులు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశం ఉంది. కుట్రల కారణంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇక అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వైవాహిక జీవితంలో కలహాలు జరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో బంధం విషయంలో ఓ అడుగు తగ్గడం మంచిది.
మిథున రాశి ( Gemini )
వృశ్చికంలోకి శుక్రుడు ప్రవేశించడంతో.. మిథున రాశి వారు జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవలసి వస్తుంది. నవంబరు 07 వరకూ మిథున రాశి వారు చేపట్టిన పనులు పూర్తికావు.. పూర్తి అయినా కానీ మంచి ఫలితాలు సాధించలేరు. ఎక్కువ కష్టపడతారు కానీ ఆశించిన విజయం సాధించలేరు. ఒత్తిడి ఉంటుంది. నిరాశ చుట్టుముడుతుంది. పాత వ్యాధులు తిరగబెట్టే సూచనలున్నాయి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కోర్టు కేసులలో చిక్కుకునేవారు సంయమనం పాటించాలి. కోర్టు బయటే సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి.
ధనుస్సు రాశి ( Sagittarius )
వృశ్చిక రాశిలో శుక్రుని సంచారం వల్ల ధనుస్సు రాశి వారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవలసి వస్తుంది. మీ లెక్కలోకి రాని ఖర్చులు ఇబ్బంది కలిగించవచ్చు. విలాసాలు, సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయడం మీ పొదుపుపై ప్రభావం చూపుతుంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. పని ఒత్తిడి పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు రాకపోవడంతో నిరాశ చెందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి. ముఖ్యంగా కళ్లు, పొట్టకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడతారు.