Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహాన్ని( Mars ) స్వతంత్ర భావాలు కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. కుజుడు ఒకరి కింద పని చేసేందుకు ఏ మాత్రం ఇష్టపడడు. అధికారం కోసం ఎక్కువగా పరితపిస్తాడు. ఆర్థిక విషయాల్లోనూ తనదే పైచేయి ఉండాలని కోరుకుటాడు. అలా భావించే కుజ గ్రహం ప్రస్తుతం తన స్వక్షేత్రమైన వృశ్చిక రాశి( Scorpio )లో సంచారం చేస్తోంది. ఈ స్వక్షేత్ర సంచారం డిసెంబర్ 7 వరకూ కొనసాగుతుంది. ఈ సమయంలో మేషం( Aries ), సింహం( Leo ), తుల( Libra ), వృశ్చికం( Scorpio ), మకర( Capricorn ) రాశుల వారు ఉద్యోగంలో అధికార యోగం చేపట్టడంతో పాటు ఉద్యోగాలు మారడం, వ్యాపారాల్లోకి ప్రవేశించడం వంటివి తప్పకుండా జరుగుతాయని పండితులు చెబుతున్నారు.
మేషం ( Aries )
కుజ గ్రహం వృశ్చిక రాశిలో సంచారం వల్ల మేష రాశి వారికి ఎన్నో లాభాలు కలగనున్నాయి. ఈ రాశి వారు తప్పకుండా ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఏదైనా సంస్థలో పూర్తి స్థాయిలో అధికారం అనుభవించడానికి వీరు ప్రయత్నించి సఫలం కావడం జరుగుతుంది. సొంతంగా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. అన్ని విధాలుగా ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దీంతో ఆర్థికంగా పురోగతి చెందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారి స్వతంత్ర భావాలు తప్పకుండా నెరవేరుతాయి.
సింహం( Leo )
సింహ రాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇతరుల కింద పని చేయడం ఇష్టం ఉండదు. అయితే వృశ్చిక రాశిలో కుజుడి సంచారం నేపథ్యంలో మేష రాశి వారు ఉద్యోగ పరంగా రిస్కు తీసుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. ఈ రాశికి అత్యంత శుభుడైన కుజుడు చతుర్థ స్థానంలో బలంగా ఉన్నందువల్ల ఉద్యోగం నుంచి వ్యాపారంలోకి మారే అవకాశం ఉంది. వీరికి ఇతర శుభ గ్రహాల అనుకూలత కూడా తోడవుతున్నందు వల్ల షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభించడం కూడా జరుగుతుంది.
తుల ( Libra )
ఇక తులా రాశి వారు కూడా సొంతంగా వ్యాపారం చేస్తే తప్పకుండా ఆర్థికంగా రాణిస్తారు. వీరికి ఇతరుల కింద అసలు పని చేయడం ఇష్టం ఉండదు. ప్రస్తుతం ధన స్థానాధిపతి కుజుడు ధన స్థానంలో, వ్యాపారవేత్త బుధుడితో కలిసి ఉండడం వల్ల ఈ రాశివారు తప్పకుండా వ్యాపారాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. వీరు షేర్లు, స్పెక్యులేషన్ల వంటి వ్యవహారాల్లో కూడా సిద్ధహస్తులయినందువల్ల వీటి వల్ల విశేష లాభాలు పొందే అవకాశం ఉంది. వడ్డీ వ్యాపారాలు కలిసి వస్తాయి.
వృశ్చికం ( Scorpio )
ఈ రాశివారిలో స్వతంత్ర భావాలు కాస్తంత ఎక్కువ. అధికారం చెలాయించడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం రాశినాథుడు కుజుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల అధికారం చెలాయించడానికి అవకాశం ఉన్న ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఆస్తి లాభం పొందడానికి, సొంత ఇంటిని కలిగి ఉండడానికి కూడా వీరు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయాల్లో చేసే ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు.
మకరం ( Capricorn )
ఉద్యోగంలో కన్నా సొంత వ్యాపారాల మీద ఆధారపడడం మంచిదని గట్టిగా నమ్మే ఈ రాశివారికి లాభ స్థానంలో ఉన్న లాభాధిపతి కుజుడు అనేక విధాలుగా అండగా నిలబడే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపారాల్లో, షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రాశివారు సాహసించే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరు ఎటువంటి రిస్కు తీసుకున్నా ఆశించిన ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
