Holi Festival | హోలీ రోజున ఐదు శ‌క్తివంత‌మైన యోగాలు.. ఈ నాలుగు రాశుల వారికి ద‌శ తిరిగిన‌ట్లే..!

Holi Festival | మార్చి 3వ తేదీన హోలీ పండుగ( Holi Festival )వేడుక‌లు నిర్వ‌హించుకునేందుకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే ఈ హోలీ పండుగ‌కు ప్ర‌త్యేక‌త ఉంది. హోలీ రోజున ఐదు శ‌క్తివంత‌మైన యోగాలు( Yogam ) ఏర్ప‌డుతున్నాయట‌. దీంతో ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి ద‌శ తిరుగుతుంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Holi Festival | హోలీ( Holi Festival ) రోజున శక్తివంతమైన ఐదు యోగాలు( Yogam ) ఏర్పడుతున్న‌ట్లు జ్యోతిష్య పండితులు ప్ర‌క‌టించారు. వాటిలో ముఖ్యంగా మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రదిత్య రాజయోగం , లక్ష్మీ నారాయణ రాజయోగం, ధన శక్తి యోగం. ఈ ఐదు అద్భుత‌, శ‌క్తివంత‌మైన యోగాల వ‌ల్ల ఈ నాలుగు రాశుల( Zodiac Signs ) వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా కలిసి రానున్నది. మ‌రి ఆ నాలుగు రాశులేవో తెలుసుకుందాం.

వృషభ రాశి  (Taurus)

ఈ ఐదు శ‌క్తివంత‌మైన యోగాల వ‌ల్ల వృషభ రాశి వారికి తిరుగులేదు. ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి. శుక్రుడు మంచి స్థానంలో ఉండ‌డం వ‌ల్ల సంప‌ద పెరుగుతుంది. ఊహించ‌ని విధంగా ఆదాయం స‌మ‌కూర‌డంతో.. స్థిరాస్తి లేదా కొత్త వాహ‌నం కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. ఇంటా బ‌య‌ట సంతోష‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

మిథున రాశి ( Gemini )

మిథున రాశి వారికి ద‌శ తిర‌గ‌నుంది. ఆర్థికంగా ఊహించ‌ని లాభాలు గ‌డిస్తారు. ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగం ల‌భించ‌నుంది. ఏదో ఒక ఆస్తిని కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. విద్యార్థులు కూడా ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది.

సింహ రాశి ( leo )

ఈ రాశిలో జన్మించిన వారికి ఐదు రాజయోగాలు ఏర్పడటం అదృష్టాన్ని ఇస్తుంది. వీరి రాశి సూర్యునిచే పాలించడం వలన వీరికి బుధాదిత్య, శుక్రాదిత్య రాజయోగం వలన వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆదాయం వచ్చి చేరుతుండటంతో చాలా ఆనందంగా గడుపుతారు

తుల రాశి ( Libra )

తుల రాశి వారికి హోలీ పండుగతో అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంది. అలాగే ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది

 

Latest News