Zodiac Signs | ఏప్రిల్ నెల‌లో ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Zodiac Signs | న‌వ గ్ర‌హాల్లో శ‌ని గ్ర‌హం అత్యంత శ‌క్తివంతంగా ఉంటుంది. శ‌ని కార‌ణంగా చాలా మందికి అశుభాలు క‌లుగుతుంటాయి. కానీ కొంత మందికి శ‌ని అనుగ్రహిస్తే అన్నీ శుభాలే క‌లుగుతుంటాయి.

  • By: raj |    telangana |    Published on : Mar 21, 2026 1:12 AM IST
Zodiac Signs | ఏప్రిల్ నెల‌లో ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Zodiac Signs | న‌వ గ్ర‌హాల్లో శ‌ని గ్ర‌హం అత్యంత శ‌క్తివంతంగా ఉంటుంది. శ‌ని కార‌ణంగా చాలా మందికి అశుభాలు క‌లుగుతుంటాయి. కానీ కొంత మందికి శ‌ని అనుగ్రహిస్తే అన్నీ శుభాలే క‌లుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నెల‌లో ఈ నాలుగు రాశుల‌పై శ‌ని అనుగ్ర‌హం ఉంటుంది. ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. మ‌రి ఆ నాలుగు రాశులేవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ప్ర‌ధానంగా శ‌ని గ్ర‌హం కొన్ని సార్లు ఉదయించ‌డం, కొన్ని సార్లు అస్త‌మించ‌డం జ‌రుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు సంచారం కూడా చేస్తుంటారు. అయితే చాలా రోజుల త‌ర్వాత శ‌ని గ్ర‌హం ఏప్రిల్ 17న మీన రాశిలో ఉద‌యించ‌డం జ‌రుగుతుంది. దీంతో చాలా రాశుల‌కు అశుభాలు క‌లిగితే.. ఈ నాలుగు రాశుల వారికి శుభాలు క‌ల‌గ‌నున్నాయి. దీంతో పాటు ఈ నాలుగు రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. ఏ ప‌నికి కూడా ఆటంకం క‌ల‌గ‌కుండా ఉంటుంది.

వృష‌భ రాశి  (Taurus) 

మీన రాశిలో శ‌ని ఉద‌యించ‌డం మూలంగా.. వృష‌భ రాశి వారికి అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌ల‌గ‌నున్నాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం చేకూర‌నుంది. ప్ర‌తి ప‌నిలోనూ విజ‌యం ల‌భిస్తుంది. ఇంటా బ‌య‌ట సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డి.. చేప‌ట్టిన ప్ర‌తి ప‌ని విజ‌య‌వంతంగా పూర్తి కానుంది. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి తీర్థ‌యాత్ర‌లు చేయ‌నున్నారు.

మిథున రాశి (Gemini)

మిథున రాశి వారికి కూడా ఏప్రిల్ నెల‌లో అనేక శుభాలు క‌ల‌గ‌నున్నాయి. ఈ రాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే కానుంది. అంతేకాకుండా ఇంటా బ‌య‌ట సానుకూల వాతవ‌రణం ఏర్ప‌డ‌నుంది. స‌మాజంలో మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదిస్తారు. గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. చాలా రోజుల నుంచి ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.

మకర రాశి (Capricorn)

మకర రాశి వారికి చాలా అద్భతంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పనుల్లో విజయం మీ సొంతం అవుతుంది. వ్యాపార ప్రారంభించాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారానికి ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది.

కుంభ రాశి  (Aquarius)

కుంభ రాశి వారికి శని అనుగ్రహం వలన సానుకూల ఫలితాలు కలగనున్నాయి. పనుల్లో విజయం వరిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. శని ప్రభావంతో చాలా సమస్యల నుంచి బయటపడగలుగుతారు.