Daily Pooja | ప్రతీరోజూ ఇంట్లో నిత్యపూజ ఎవరు చేయాలో తెలుసా? ఎవరికీ తెలియని విషయం ఇది.!

రోజూ ఇంట్లో పూజను భార్య చేయాలా, భర్త చేయాలా? సనాతన ధర్మంలో చెప్పబడిన శాస్త్రోక్త నియమాలు, పూజా ఫలితాలు, గృహస్థ ధర్మం ప్రకారం ఎవరు పూజ చేయాలి అన్న విషయంపై పూర్తి విశ్లేషణ.

Traditional Indian home puja with deepam and flowers

Who Should Perform Daily Puja at Home? Sanatana Dharma’s Traditional Guidance Explained

Daily Pooja | ప్రతి ఇంట్లో ఉదయం జరిగే పూజాచర్యలు సనాతన సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనవి.
దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టడం, దేవతలను ఆరాధించడం—ఇలా నిత్యపూజ ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయితే తరతరాలుగా చాలా మందిలో ఒక సందేహం మాత్రం అలాగే కొనసాగుతోంది:

రోజూ ఇంట్లో పూజను ఎవరు చేయాలి? ఇల్లాలు చేయాలా? లేక ఇంటి యజమాని చేయాలా?

చాలా ఇళ్లలో స్త్రీలే పూజలు చేస్తూ ఉంటారు. కానీ శాస్త్రోక్తంగా సనాతన ధర్మంలో ఈ విషయంపై ప్రత్యేక సూచనలు ఉన్నాయి. పూజా ఫలితం ఎవరికీ ఎలా చెల్లుతుంది? ఎవరు పూజ చేస్తే కుటుంబానికి శ్రేయస్సు ఎక్కువ? — ఇవన్నీ పండితాధారాలతో ఇప్పుడు తెలుసుకుందాం.

శాస్త్రం ఏం చెప్తోంది? గృహంలో పూజాధికారం ఎవరిది?

సనాతన ధర్మంలో గృహస్థుడు ఇంటి ప్రధాన కర్తగా పేర్కొనబడాడు. సంకల్ప శ్లోకాల్లో కూడా “ధర్మపత్ని సమేతస్య…” అని రావడం ద్వారా, పూజార్థం పురుషుడే యజమానిగా భావించబడతాడు.

అంటే శాస్త్రం సూచించేదేమిటంటే—
రోజూ నిత్య పూజ భర్త చేయడం ఉత్తమం.

పూర్తి ఆరాధన, దీపం వెలిగించడం, సంకల్పం చెప్పడం వంటి ప్రధాన కార్యాలు భర్త చేస్తే, ఫలితం కుటుంబ సభ్యులందరికీ సమానంగా వస్తుంది అని ధర్మశాస్త్రం పేర్కొంటోంది.

స్త్రీ చేసే పూజ పవిత్రమే అయినప్పటికీ, ఆమె చేసే వ్రతాలు, నోములు, ఉపవాసాలు.. (అంటే పిల్లల కోసమో, ఇంటి క్షేమం కోసమో, ధన, సౌఖ్యప్రాప్తి కోసమే అని)సాధారణంగా ఆమె వ్యక్తిగత కోరికలు, సంకల్పాలకు సంబంధించిన పుణ్యంగా భావించబడతాయి. అందుకే అవి వ్యక్తిగత ఫలితంగా చెప్పబడింది.

భార్య–భర్త ఇద్దరి పాత్రలు ఎలా ఉండాలి?

పూజ అనేది ఒక్కరి బాధ్యత కాకుండా, ఇద్దరూ కలిసి చేయాల్సిన గృహస్థ ధర్మం అని శాస్త్రార్థం.

భర్త పాత్ర:

భార్య పాత్ర:

ఇలా ఇద్దరూ కలిసి చేసిన పూజే అత్యుత్తమం అని సంప్రదాయం చెబుతోంది.

అంతేకాక, ఇంట్లో శుభకార్యాలు ఆలస్యమవుతున్నట్లయితే లేదా శాంతి తగ్గినట్లయితే పండితులు సూచించే ఒక ముఖ్యమైన పరిహారం ఉంది— ప్రతి రోజూ ఆవు నేతితో దీపారాధన చేయడం.

ఇది ఇంటికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది అని శాస్త్రోక్తంగా నమ్ముతారు.

సనాతన ధర్మం ప్రకారం ఇంట్లో నిత్య పూజను భర్త చేయడం ఉత్తమం. అయితే భార్య చేసే పూజలు కూడా పవిత్రమే. ఇద్దరూ కలిసి పూజలో పాల్గొంటే కుటుంబానికి శాంతి, శ్రేయస్సు, సంపద— ఇలా అన్నిరకాలుగా  సంతోషంగా ఉంటారు. అదే నిజమైన గృహస్థ ధర్మం.

Latest News