Site icon vidhaatha

Sravana Mangala Gowri Vratha Vidhanam | శ్రావణ మంగళవారం ‌‌– మంగళగౌరీవ్రతం  ఏం చేయాలి? ఏం చేయకూడదు?

Mangala Gowri Vratham: శ్రావణమాసం మహిళలకు ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మాసంలో పూజలు, వ్రతాలు అంటూ బిజీబిజీగా ఉంటారు. శ్రావణమాసంలో ప్రతీ వారానికి ఓ విశేషం ఉంది. ప్రత్యేకించి, సోమ, మంగళ, శుక్రవారాలు పరమ పవిత్రమైన దినాలు. ఈ 2024వ సంవత్సరపు శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీన మొదలై, సెప్టెంబర్​ 3వ తేదీతీ ముగుస్తుంది. ఈ శ్రావణంలో 5 సోమవారాలు, 5 మంగళవారాలు, 4 శుక్రవారాలు వస్తున్నాయి. శ్రావణ మంగళవారాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం మంగళగౌరీ వ్రతం ఈ రోజునే చేసుకుంటారు.

మంగళగౌరీ వ్రతం విశిష్టత(Signficance of Mangala Gowri Vratham)

శ్రావణ మాసంలోని మంగళవారం రోజుని పార్వతీ దేవికి అంకితం చేశారు. ఈ మాసంలోని నాలుగు లేదా ఐదు మంగళవారాలు మహిళలు మంగళగౌరీ వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తమ ముత్తయిదత్వం ఎల్లకాలం నిలుస్తుందని నమ్ముతారు. అందుకే శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైయిన అమ్మాయిలు ఎక్కువగా మంగళగౌరీ వ్రతం చేస్తారు. భక్తి, శ్రద్ధలతో గౌరీదేవిని పూజిస్తారు. పెళ్లైన ఏడాది నుండి నుండి ఐదు సంవత్సరాలా పాటు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా చేసుకుంటారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లోనూ, తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తవారింట్లోనూ ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతం చేయడం వల్ల భోగభాగ్యాలే కాకుండా,  దీర్ఘ సుమంగళిగా ఉంటారని భావిస్తారు. వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితంలో సంతోషం, శాంతిని పొందేందుకు శ్రావణ మంగళవారం రోజున మంగళ గౌరీ దేవివ్రతాన్ని ఆచరిస్తే, పెళ్లికాని అమ్మాయిలు తమకు నచ్చిన భర్తను పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీ వ్రతం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అమ్మాయిల వివాహంలో ఆటంకాలు ఎదురవుతు ఉంటే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరం అవుతాయి. అంతేకాదు, త్వరలో వివాహం జరిగే అవకాశం ఉంటుందని నమ్మకం. అంతేకాదు దంపతుల మధ్య సమస్యలు న్నా,  సంతానం కావాలనుకున్నా ఈ మంగళగౌరి వ్రతం, ఉపవాసం ముఖ్యమైనది. అంతేకాకుండా, జాతకంలో కుజ దోషం ఉన్నట్లయితే ఆ యువతులు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వాయనం ఎవరికి ఇవ్వాలి?(To whom Vayanam to be given)

పరమశివుడు కూడా మంగళగౌరిని ఆరాధించే త్రిపురాసుర సంహారం చేశారని ప్రతీతి. అందుకే మంగళగౌరి వ్రతం చేస్తే,  ఆ జగన్మాత ఆశీర్వాదాలు దక్కుతాయని భక్తులు నమ్ముతారు. తొలిసారిగా నోముకునేవారు, వారి పక్కనే తమ తల్లిని ఉంచుకుని పూజ చేస్తే మంచిది. అలాగే తొలి వాయనాన్ని తల్లికి ఇస్తే ఇంకా మంచిది. తల్లి లేని పక్షంలో అత్త గారికి గానీ,  ఇతర ముత్తైదువులకు వాయినం ఇస్తారు.

వ్రత నియమాలు (Conditions of Mangala Gowri Vratham)

వ్రతాన్ని ఆచరించే ముందురోజు,  వ్రతం నాడు కూడా దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా వ్రతం రోజు ఉపవాసం ఉండాలి. వ్రతానికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వాలి. ఒకే మంగళగౌరీ దేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఇవే కాక,

 

వాయనంలో పసుపు, కుంకుమలు ఇవ్వకూడదు (No Yellow and Red turmeric powder in Vayanam)

వాయనం ఇచ్చేటప్పుడు పసుపు, కుంకుమలు ఇవ్వకూడదు అంటారు. ఎందుకంటే సౌభాగ్యంకోసం వ్రతం చేస్తున్నప్పుడు, ముత్తయిదువలు ఆ పసువుకుంకుమల కోసమే వ్రతమాచరిస్తున్నారు కాబట్టి, వాటికి వాయనంలో ఇవ్వకూడదని శాస్త్రం చెబుతోంది. పసుపు, కుంకుమలతో ముత్తైదువులకు బొట్టు పెట్టొచ్చుకానీ,  చేతికి ఇవ్వకూడదు.

 

 

Exit mobile version