Vastu Tips | ఈ ఐదు పొర‌పాట్లే.. మీ ఇంట్లో ద‌రిద్రానికి కార‌ణం..!

Vastu Tips | చిన్న చిన్న పొర‌పాట్లే( Mistakes ) జీవితానికి పెనుస‌వాలుగా మారుతాయి. ఆ త‌ప్పుల వ‌ల్ల ద‌రిద్రం( Poverty ) వెంటాడుతది. ఈ ఐదు చిన్న పొర‌పాట్లు చేయ‌కుండా ఉంటే.. మ‌న‌ల్ని ద‌రిద్రం వ‌దిలిన‌ట్టే. మ‌రి ఆ పొర‌పాట్లు ఏవో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం..

Vastu Tips | ప్ర‌తి ఇల్లు కూడా సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని ఆ కుటుంబ య‌జ‌మాని కోరుకుంటాడు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో వివాదాలు త‌లెత్తుతూనే ఉంటాయి. స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతూనే ఉంటాయి. వీట‌న్నింటిని అధిగ‌మించాలంటే వాస్తు నియ‌మాలు( Vastu Tips ) త‌ప్ప‌క పాటించాలి. కానీ చాలా మంది వాస్తు నియ‌మాల‌ను పాటించ‌కపోవ‌డం మూలంగా అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటారు. మ‌రి ముఖ్యంగా ఈ ఐదు చిన్న త‌ప్పులే( Mistakes ).. మీ ఇంట్లో ద‌రిద్రానికి( Poverty ) కార‌ణ‌మ‌ని వాస్తు పండితులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ ఐదు పొర‌పాట్లు చేయ‌కుండా ఉంటే.. ప్ర‌తి ఇల్లు కూడా అష్టైశ్వ‌ర్యాల‌తో సుఖ‌సంతోషాల‌తో వ‌ర్ధిల్లుతుంద‌ని పండితులు పేర్కొన్నారు. మ‌రి ఆ ఐదు త‌ప్పులేవో తెలుసుకుందాం.

ఆలస్యంగా నిద్ర లేవ‌డం..

చాలా నివాసాల్లో చాలా మంది వేకువ‌జామున నిద్ర మేల్కొన‌రు. సూర్యుడు ఉద‌యించిన త‌ర్వాత మేల్కొని త‌మ దిన‌చ‌ర్య ప్రారంభిస్తారు. ఇలా చేయ‌డం ఆ కుటుంబానికి ఏ మాత్రం మంచిది కాద‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం తెల్ల‌వారుజామున 4 నుంచి 6 గంట‌ల మ‌ధ్య ఇంటి య‌జ‌మానులు మేల్కొనాలి. సూర్యోద‌యానికి ముందే స్నానం చేసి.. దిన‌చ‌ర్య‌ను ప్రారంభించాలి. సూర్యుని సానుకూల శక్తిని పొందడానికి, ఇంట్లో సానుకూల విషయాలు జరగడానికి ఈ దినచర్య అవసరం. దీనికి విరుద్ధంగా, సూర్యోదయం తర్వాత కూడా ఇంట్లో నిద్రపోవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఏ ప‌ని త‌ల‌పెట్టినా ఆటంకం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని పండితులు హెచ్చ‌రిస్తున్నారు.

నీళ్లు కార‌డం..

చాలా నివాసాల్లో కిచెన్‌లో కానీ లేదా బాత్రూమ్‌లో కానీ లేదా బాల్కనీలో ఉన్న వాట‌ర్ ట్యాప్ నుంచి నీళ్లు కారుతుంటాయి. ఇలా నీరు కార‌డం కూడా ఆ ఇంటికి ఏ మాత్రం మంచిది కాద‌ట‌. నీరు కార‌డం వ‌ల్ల ఆ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తి ఏర్ప‌డుతుంద‌ట‌. సంపాద‌న కూడా నీళ్ల‌లా క‌రిగిపోతుంద‌ట‌. కాబ‌ట్టి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి, ఒక గ్లాసు నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి మీ ఇంటిని శుభ్రం చేసుకోవాల‌ని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

పాత బూట్లు

చాలా మంది పాత బూట్ల‌ను, వాడ‌ని బూట్ల‌ను అలానే చెప్పుల స్టాండ్‌లో ఉంచేస్తుంటారు. సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి అవి అలానే ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. కానీ పాత‌బూట్ల‌ను త‌ప్ప‌కుండా ప‌డేయాల‌ని చెబుతున్నారు వాస్తు పండితులు. ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద పాడైన చెప్పులను, బూట్ల‌ను ఉంచడం వల్ల లక్ష్మీదేవి ఇంటికి రాకుండా ఉంటుంది. కష్టాలు, ఇబ్బందులను తెస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం మంచిది.

పగిలిన గాజు

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పగిలిన గాజును ఉంచుకోవడం పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. గాజు వస్తువులను మాత్రమే కాకుండా, పగిలిన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఉంచడం తప్పుగా పరిగణించబడుతుంది. అలాంటి పగిలిన గాజు వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల రాహు దోషం పెరుగుతుంది. ఇది పనిలో అడ్డంకులను సృష్టిస్తుంది. మీ కెరీర్‌లో పురోగతి సాధించకుండా నిరోధిస్తుంది.

లైట్లు వేయకపోవడం

మీ ఇంటిని ప్రకాశవంతంగా ఉంచడానికి మీరు ఎంత పెద్ద విద్యుత్ బల్బును ఉపయోగించినా, లక్ష్మీ దేవిని ఆకర్షించడానికి వారానికి రెండుసార్లు (శుక్రవారాలు, మంగళవారాలు మొదలైనవి) దీపం వెలిగించి పూజ చేయడం ముఖ్యం. ఇంట్లో స్థిరపడిన దుష్టశక్తులను పారద్రోలి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఈ ఆచారం అవసరమని నిపుణులు అంటున్నారు. వీలైతే రోజుకు ఒకసారి ఇంట్లో దీపం వెలిగించడం మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు.