Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది సహజంగా జరిగేది. అయితే అక్టోబర్ 9వ తేదీన శుక్ర గ్రహం కన్యారాశి( Virgo )లోకి ప్రవేశించనుంది. సంపదకు, శ్రేయస్సు, ఆనందానికి కారకుడైన శుక్రుడు( Venus ).. కన్యారాశిలోకి ప్రవేశించడం మూలంగా.. ఓ నాలుగు రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగనున్నాయి. పట్టిందల్లా బంగారమే కానుంది. మరి ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం..
సింహ రాశి( Leo )
ఈ రాశి వారికి సాధారణంగా అధికంగా ఖర్చులు పెరుగుతాయి. కానీ శుక్ర గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించడం కారణంగా.. అంతకు మించి ఆదాయం వస్తుంది. దీంతో అధిక ఖర్చులను ఈజీగా అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు వస్తాయి. పెట్టుబడులు కూడా పెడుతారు. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో వారి కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
వృశ్చిక రాశి( Scorpio )
కన్యా రాశిలోకి శుక్రుడు సంచారం కారణంగా.. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ నెలలో ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీంతో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఊహించని మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇంట్లో ఆనందంగా ఉంటారు. మొత్తానికి వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది.
మిథున రాశి( Gemini )
మిథున రాశి వారికి అక్టోబర్ 9నుంచి శుభ ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. శుక్ర గ్రహం సంచారం వలన వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల సుడిగుండం నుంచి బయటపడుతారు. అనుకోని విధంగా ఎక్కువ మొత్తంలో డబ్బు చేతికందుతుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
మీన రాశి( Pisces )
శుక్ర గ్రహం కన్యారాశిలోకి ప్రవేశించడంతో.. మీన రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా బాగుంటుంది. వ్యాపారస్తులు చాలా లాభాలు పొంది ఆనందంగా గడుపుతారు.