వంటింట్లో ఇవి ఉంచుకుంటే.. ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతాయ‌ట‌..!

వాస్తు నియ‌మం ప్ర‌కారం వంట గ‌దిని నిర్మించుకున్న‌ప్ప‌టికీ, ఈ వ‌స్తువులు, ప‌దార్థాలు వంటింట్లో ఉంచుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడడం ఖాయ‌మ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మ‌రి అవేంటో తెలుసుకుందాం..

  • Publish Date - April 24, 2024 / 06:50 AM IST

ఏ ఇంటికైనా వంటిల్లు చాలా ప్ర‌ధానం. ఎందుకంటే వంట గ‌ది వాస్తు ప్ర‌కారం ఉంటేనే ఆ ఇంట్లో శుభాలు క‌లుగుతాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయనేది వాస్తు నిపుణుల అభిప్రాయం. కాబ‌ట్టి వాస్తు నిపుణులు సూచించిన విధంగా వంట గ‌దిని ఏర్పాటు చేసుకుంటారు. మ‌రి ఈ వాస్తు నియ‌మం ప్ర‌కారం వంట గ‌దిని నిర్మించుకున్న‌ప్ప‌టికీ, ఈ వ‌స్తువులు, ప‌దార్థాలు వంటింట్లో ఉంచుకుంటే ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడడం ఖాయ‌మ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మ‌రి అవేంటో తెలుసుకుందాం..

పాడైపోయిన ఆహారం..

పాడైపోయిన ఆహారాన్ని, పాచిపోయిన ఆహార ప‌దార్థాల‌ను కిచెన్‌లో అస‌లు ఉంచుకోవ‌ద్దు. ఇలాంటి వాటిని ఉంచుకోవ‌డం వ‌ల్ల ద‌రిద్రానికి ఆహ్వానం ప‌లికిన‌ట్లు అవుతుంది. ఖ‌ర్చులు కూడా పెరిగి ఇంట్లో సంప‌ద తరిగిపోయే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి పాడైపోయిన ఆహార ప‌దార్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డేయ‌డం మంచిద‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఖాళీ డబ్బాలు

చాలా మంది గృహిణులు ఖాళీ డ‌బ్బాల‌ను కిచెన్‌లో జ‌మ చేస్తుంటారు. ఏదో ఒక దానికి ఉప‌యోగ‌ప‌డుతాయ‌నే ఉద్దేశంతో ఖాళీ డ‌బ్బాల‌ను ప‌డేయ‌రు. అయితే ఈ ఖాళీ డ‌బ్బాలు ఆర్థిక లేమికి కార‌ణ‌మ‌వుతాయ‌ని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఖాళీ డ‌బ్బాల‌ను ప‌డేయడం మంచిది. ఇల్లు సమృద్ధిగా ఉండాలంటే తప్పకుండా కిచెన్ లో వంటసామాగ్రీకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తపడాలి. ఇలా వంటచేసుకునేందుకు అవసరమయ్యే అన్ని దినుసులు నిండుగా ఉండడం కలిమికి సంకేతం.

వాడకంలో లేని కిచెన్ సామాగ్రి

చాలా రోజులుగా వాడని సామాగ్రి ఏదైనా కిచెన్ లో ఉంటే వెంటనే తొలగించడం మంచిది. ఎందుకంటే ఇవి కిచెన్ లో స్థలం ఆక్రమించడమే కాదు, నెగెటివ్ ఎనర్జీ కేంద్రాలుగా మారుతాయి. ఫలితంగా ఇంట్లో లక్ష్మి నిలవదు. ఖర్చులు పెరిగిపోయి అప్పులు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. విరిగిన స్పూన్స్, ప‌గిలిపోయిన గిన్నెలు, కుండ‌ల వంటి సామాగ్రిని ఇంట్లో ఉంచుకోక‌పోవ‌డం మంచిది.

పదునైన వస్తువులు

కిచెన్‌లో క‌త్తిపీట‌లు, చాకులు ఉప‌యోగించ‌డం స‌హ‌జం. అయితే వీటిని ఉప‌యోగించిన త‌ర్వాత అలాగే వ‌దిలేయ‌కూడ‌దు. వాటిని వెంట‌నే శుభ్ర‌ప‌రిచి స‌రైన స్థ‌లంలో భ‌ద్ర‌ప‌ర‌చాలి. ఒక వేళ అలా చేయ‌క‌పోతే ప్ర‌మాదాలు జ‌రిగి, ఆర్థిక న‌ష్టం కూడా సంభ‌వించే అవ‌కాశం ఉంటుంది.

Latest News